AP: వరదల్లో చిక్కుకున్న రైతు కూలీలు, పశువుల కాపరులు..!

భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలో రైతు కూలీలు వరదల్లో చిక్కుకున్నారు. ఎగువ కురిసిన వర్షాలకు పెదవాగు ప్రాజెక్ట్‌కు భారీగా వరద నీరు చేరడంతో అధికారులు గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. సమాచారం లేకపోవడంతో రైతు కూలీలు, పశువుల కాపరులు వరద ప్రవాహంలో చిక్కుకుపోయారు.

New Update
AP: వరదల్లో చిక్కుకున్న రైతు కూలీలు, పశువుల కాపరులు..!

Khammam: భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలో రైతు కూలీలు వరదల్లో చిక్కుకున్నారు. ఎగువ కురిసిన వర్షాలకు పెదవాగు ప్రాజెక్ట్‌కు భారీగా వరద నీరు చేరడంతో అధికారులు గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో వరి నాట్లు వేయడానికి వెళ్ళిన కూలీలు నీటి ప్రవాహంలో చిక్కుకున్నారు. సుమారు 30 మంది నీటి ప్రవాహంలో చిక్కుకొని బయటకు రాలేక సహాయం కోసం పడిగాపులు కాస్తున్నారు.

Also read: ఎంపీడీఓ మిస్సింగ్ పై డిప్యూటీ సీఎం సీరియస్.. అసలు కారణం ఇదే అంటున్న MPDO తనయుడు..!

అకస్మాత్తుగా వరద ప్రవాహం పోటెత్తడంతో పశువుల కాపరులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. కొందరు చెట్లపైకెక్కి అధికారుల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు ప్రారంభించారు.

Advertisment
తాజా కథనాలు