AP: రాష్ట్ర నీటి హక్కులను కాపాడండి.. కలెక్టరేట్ వద్ద రైతుల ఆందోళన.!

మన రాష్ట్ర నీటి హక్కులను కాపాడాలంటూ అనంతపురం కలెక్టరేట్ వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ గేటు ఎదుట బైఠాయించి.. కృష్ణా జలాలు పరిరక్షణ కోసం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

AP: రాష్ట్ర నీటి హక్కులను కాపాడండి.. కలెక్టరేట్ వద్ద రైతుల ఆందోళన.!
New Update

Anantapur: మన రాష్ట్ర నీటి హక్కులను కాపాడాలంటూ అనంతపురం కలెక్టరేట్ వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ గేటు ఎదుట బైఠాయించి.. కృష్ణా జలాలు పరిరక్షణ కోసం చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. ప్రస్తుతం రాయలసీమ తీవ్ర కరవు పరిస్థితుల్లో ఉందని.. ఇలాంటి సమయంలో కృష్ణా నుంచి నీరు రాకపోతే.. వ్యవసాయం తో పాటు తాగునీటి కూడా కష్టాలు వచ్చే పరిస్థితి ఉందని రైతు సంఘం నాయకుడు మల్లికార్జున అన్నారు.

Also Read: మీలాగే దేశానికి సేవ చేస్తా.. ఆర్మీకి మూడో తరగతి బాలుడి లేఖ.. రాయన్ లేఖపై ఆర్మీ ఎమోషనల్..!

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు కృష్ణా నదీ జలాల పునఃపంపిణీ ద్వారా మన హక్కులను కాపాడాల్సిన సమయం అసన్నమైందన్నారు. ఆగస్టు 2వ వారంలోపు రాష్ట్ర ప్రభుత్వం తమ వాదనలతోకూడిన నివేదికను ఇవ్వాలని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కోరిందని.. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు కీలకంగా ఉన్నారని ఇలాంటి సమయంలో మన హక్కులు సాధించుకోవడం సాధ్యమవుతుందన్నారు. ఎగువన కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాయలసీమ ఎడారి అవుతుందన్నారు..

#ananthapur
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe