Nizamabad: నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ధరణిలో భూమి నమోదు కాకపోవడంతో అప్పులు తీర్చే మార్గం కానరాక రైతు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అర్గుల్ గ్రామానికి చెందిన కుంట రాజేష్ అనే వ్యక్తికి రెండెకరాల భూమి ఉంది. ఉన్న ఆ రెండెకరాలలోనే వివిధ రకాల కూరగాయలు పండించేవారు.
Also Read: మధ్యాహ్న భోజనం తిన్న 100 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్!
అయితే, రాజేష్ కు వ్యవసాయం తోపాటు బయట వ్యాపారాలతో దాదాపు రూ.12 లక్షల వరకు అప్పు ఉంది. దీంతో తనకున్న రెండెకరాలను అమ్మీ అప్పులు తీరుద్దామని ప్రయత్నించారు. కానీ, తన భూమి ధరణిలో నమోదు కాకపోవడంతో అమ్మేందుకు వీలు పడలేదు. మరోవైపు అప్పుల వాళ్లు రోజూ ఫోన్లు చేసి తనను డబ్బులు కట్టాలని వేధించేవారు. దీంతో ఆ రైతు తీవ్ర మనోవేదనకు గురైయ్యాడు. ఇక ఈ బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్నాడు.
Also Read: గురుకుల స్కూల్‌లో వరుస విషాదాలు.. ఉన్నట్టుండి చనిపోతున్న విద్యార్థులు.. అసలేం జరుగుతుంది?
సెల్‌ఫోన్‌లో రైతు రాజేష్ తన బాధను వాయిస్ రికార్డు చేశారు. అనంతరం ఆ రైతు గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. తన వాయిస్ రికార్ట్ లో.. తన పిల్లలు చిన్నవారని.. దయచేసి వారికి ఎలాంటి హాని తలపెట్టొద్దని రోదిస్తూ అభ్యర్థించారు. రైతు రాజేశ్‌కు భార్య లలిత, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు.