బ్యాగ్‌లో రాళ్లను తెచ్చి, ముఖానికి గుడ్డ కట్టి..' రాళ్లు రువ్విన..బయటకొచ్చిన వీడియో!

శంభు సరిహద్దు వద్ద రైతులు అల్లర్లు సృష్టిస్తున్న చిత్రాలు,వీడియోలను విడుదల చేశారు.కొంతమంది రైతులు పోలీసులపై రాళ్లు రువ్వడం కనిపించింది. సరిహద్దు దాటకుండా రైతులను అడ్డుకునేందుకు పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్‌ను ప్రయోగిస్తుండగా, ఆందోళనకారులు వారిపై రాళ్లు రువ్వారు.

New Update
బ్యాగ్‌లో రాళ్లను తెచ్చి, ముఖానికి గుడ్డ కట్టి..' రాళ్లు రువ్విన..బయటకొచ్చిన వీడియో!

Farmers Protest: హర్యానా (Haryana)  పోలీసులు అంబాలాలోని శంభు సరిహద్దు వద్ద రైతులు (Farmers) అల్లర్లు సృష్టిస్తున్న చిత్రాలు, వీడియోలను విడుదల చేశారు, ఇందులో కొంతమంది రైతులు పోలీసులపై రాళ్లు రువ్వడం(Pelting Stones)  కనిపించింది. సరిహద్దు దాటకుండా రైతులను అడ్డుకునేందుకు పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్‌ను ప్రయోగిస్తుండగా, కొందరు ఆందోళనకారులు వారిపై రాళ్లు రువ్వారు. ఈ వీడియోలు, చిత్రాలను విడుదల చేసిన పోలీసులు దాడులకు పాల్పడిన వారిని గుర్తించడం లో ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఫిబ్రవరి 13, 14న రైతులు ఢిల్లీకి పాదయాత్ర( Delhi Chalo)  చేసేందుకు వెళ్తున్న సమయంలో తీసిన వీడియో ఒకటి బయటకు వచ్చింది.ఆ సమయంలో పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. దీంతో మరోపక్కన ఉనన యువకులు పోలీసుల పై రాళ్లు రువ్వుతూ కనిపించారు. రాళ్లను పోలీసులపైకి విసురుతున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి.

18 మంది పోలీసులు సహా 25 మంది భద్రతా సిబ్బంది

ఇది ముందుగా అనుకున్న దాడి అని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ముందుగానే ఆందోళనకారులు ఓ క్యారీ బ్యాగ్ లో రాళ్లను తీసుకుని వచ్చారు. రాళ్లను విసిరే సమయంలో వారు తమ ముఖాలను మాస్క్‌ లతో కవర్‌ చేశారు. భద్రతా బలగాలపై రాడ్లు, కర్రలు ప్రయోగించడంతోపాటు రాళ్లు రువ్వారు.

రాళ్లు రువ్విన నిరసనకారులను గుర్తించాలని స్థానిక ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాము.'' ఈ ఘటనలో 18 మంది హర్యానా పోలీసులతో సహా 25 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారని ఆయన చెప్పారు.

Also read:  కాయలు మాత్రమే కాదు.. ఆకులు కూడా ఔషదాలే.. కాజీ నిమ్మ ప్రత్యేకతలివే!

Advertisment
తాజా కథనాలు