Farmer Loans: వ్యవసాయరంగంలో భారీగా పెరిగిన లోన్స్.. లక్షాన్ని మించి ఇచ్చిన బ్యాంకులు వ్యవసాయరంగంలో రైతులకు ఇచ్చే లోన్స్ భారీగా పెరిగాయి. ఈ ఆర్ధిక సంవత్సరానికి నిర్ణయించిన దానిని మించి బ్యాంకులు రుణాలు ఇచ్చాయి. వడ్డీరాయితీ పథకం ద్వారా రైతులకు 4 శాతం వడ్డీకే రుణాలు అందించే పథకంలో ఈ ఆర్థికసంవత్సరం ఇప్పటివరకూ రూ.20.39 లక్షల కోట్లు రుణాలు ఇచ్చారు. By KVD Varma 23 Feb 2024 in బిజినెస్ నేషనల్ New Update షేర్ చేయండి Farmer Loans: గత 10 ఏళ్ల నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో వ్యవసాయ రంగంలో బ్యాంకు రుణాలు వేగంగా పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24 ఏప్రిల్-జనవరి కాలంలో బ్యాంకులు రూ.20.39 లక్షల కోట్లు రుణాలుగా అందించగా, మొత్తం 2013-14లో రైతులకు రూ.7.3 లక్షల కోట్ల రుణాలు అందించారు. వ్యవసాయ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారిని ఊటంకిస్తూ జాతీయ మీడియా ఈ విషయాలు వెల్లడించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో వ్యవసాయ రుణ లక్ష్యాన్ని రూ. 20 లక్షల కోట్లుగా ప్రభుత్వం నిర్దేశించింది. బ్యాంకులు ఇప్పటికే లక్ష్యాన్ని అధిగమించాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య రూ. 22 లక్షల కోట్లు దాటవచ్చని అంచనా వేస్తున్నారు. వ్యవసాయ మంత్రిత్వ శాఖ రైతులకు సంవత్సరానికి ఏడు శాతం తక్కువ వడ్డీ రేటుతో వ్యవసాయ రుణాలను(Farmer Loans) అందిస్తుంది. దీనిలో భాగంగా 3 లక్షల రూపాయల వరకు స్వల్పకాలిక పంట రుణాల కోసం వడ్డీ రాయితీ పథకాన్ని అమలు చేసింది. పథకం కింద, బ్యాంకులు తమ వనరుల వినియోగంపై ప్రతి సంవత్సరం రెండు శాతం వడ్డీ రాయితీని ఇస్తారు. ఇది కాకుండా, సకాలంలో రుణాన్ని తిరిగి చెల్లించే రైతులకు మూడు శాతం అదనపు ప్రోత్సాహకం కూడా అందిస్తారు. దీని కారణంగా వడ్డీ రేటు నాలుగు శాతానికి తగ్గుతుంది. వ్యవసాయ శాఖకు సంస్థాగత రుణం 2023-24లో (జనవరి 31, 2024 నాటికి) రూ. 20.39 లక్షల కోట్లకు చేరుకుందని, ఇది 2013-14లో రూ.7.3 లక్షల కోట్లుగా ఉందని వ్యవసాయ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. 1,268.51 లక్షల ఖాతాలకు ఈ రుణం(Farmer Loans) అందించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం వ్యవసాయ రుణాల(Farmer Loans) పంపిణీ రూ.21.55 లక్షల కోట్లుగా ఉంది. ఇది నిర్ణీత లక్ష్యం రూ.18.50 లక్షల కోట్ల కంటే ఎక్కువ. ఇది కాకుండా, పశుపోషణ, మత్స్య పరిశ్రమలో నిమగ్నమైన రైతులకు KCC (కిసాన్ క్రెడిట్ కార్డ్) ద్వారా నాలుగు శాతం వార్షిక వడ్డీకి రాయితీ సంస్థాగత రుణ ప్రయోజనం ఇవ్వబడింది. వారి స్వల్పకాలిక వర్కింగ్ క్యాపిటల్ అవసరాలను తీర్చడానికి ఈ రుణం ఇవ్వబడింది. గత ఏడాది మార్చి 31 నాటికి, 73,470,282 క్రియాశీల కిసాన్ క్రెడిట్ కార్డ్ ఖాతాలు ఉన్నాయి, వాటిపై బకాయిలు రూ.8,85,463 కోట్లు. Also Read: దీన్ని కొట్టే కంపెనీ ఏదైనా ఉందా? ఒక్క షేర్ లక్షన్నర! MRF రికార్డ్!! ఇది కాకుండా, ప్రభుత్వం 2019 లో PM-కిసాన్ పథకాన్ని ప్రారంభించింది. దీని కింద అర్హులైన రైతులకు ఏటా రూ.6,000 చొప్పున మూడు సమాన వాయిదాల్లో నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. ఈ పథకం ఫిబ్రవరి 2019లో ప్రారంభించారు. అయితే ఈ పథకం ప్రయోజనాలు డిసెంబర్ 2018 నుండి రైతులకు అందించారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డిబిటి) ద్వారా వివిధ వాయిదాల ద్వారా 2018 నుండి 11 కోట్ల మందికి పైగా లబ్ధిదారులకు రూ.2.81 లక్షల కోట్లు అందించినట్లు అధికారి తెలిపారు. దీంతో పాటు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యంతో కేంద్రం గత పదేళ్లలో పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) పెంచిందని, గోధుమలు, వరి, నూనెగింజలు, పప్పుధాన్యాల కొనుగోలును కూడా పెంచిందని చెప్పారు. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ, గత 10 సంవత్సరాలలో, రైతుల నుండి వరి, గోధుమలు, పప్పుధాన్యాలు, నూనె గింజలను ఎంఎస్‌పికి కొనుగోలు చేయడానికి మోడీ ప్రభుత్వం 18.39 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని అన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యూపీఏ) ప్రభుత్వం తన పదేళ్ల హయాంలో (2004-2014) ఖర్చు చేసిన రూ.5.5 లక్షల కోట్లకు ఇది మూడు రెట్లు ఎక్కువ అని ఠాకూర్ చెప్పారు. #agriculture #agriculture-loans మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి