Farmers Protest : పంటకు కనీస మద్దతు ధర పై ప్రభుత్వం రెండు నాలుకల ధోరణి వ్యవహరిస్తుందని రైతు సంఘాలు(Farmers) తెలిపాయి. నాలుగో సారి కేంద్రంతో రైతు సంఘాలు జరిపిన చర్చలను తిరస్కరిస్తున్నట్లు రైతు సంఘాలు వివరించాయి. కేంద్ర ప్రభుత్వం రైతుల ముందు ఒక మాట మాట్లాడగా.. మీడియా ముందుకు వచ్చి మరో మాట మాట్లాడిందని తెలిపాయి.
అందుకే వారి చర్యకు నిరసనగా ఫిబ్రవరి 21 న ఢిల్లీ(Delhi) కి పయనమవుతున్నట్లు రైతు సంఘాల(Farmer's Union) నాయకులు తెలిపారు. మాతో చర్చలు జరిపినప్పుడు అన్ని పంటలను రైతుల వద్ద నుంచి కొనుగోలు చేస్తామని చెప్పారు. అంతే కాకుండా ఎమ్‌ఎస్‌పీ(MSP) కోసం ఏకంగా 1. 5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని మంత్రి వివరించారు. కానీ మీడియా ముందుకు వచ్చి వేరే మాట చెప్పారు. అందుకే మేం కేంద్రం ప్రతిపాదనను తిరస్కరిస్తున్నామని రైతు సంఘాల నాయకులు వివరించడమే కాకుండా.. ఫిబ్రవరి 21న ఢిల్లీలో శాంతియుతంగా ర్యాలీ చేసేందుకు కేంద్రం అనుమతించాలని వారు కోరారు.
ఢిల్లీకి పాదయాత్ర చేసి ఆందోళన కొనసాగిస్తామని రైతు నేతలు స్పష్టం చేశారు. ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు కేంద్రం అధికారులు రైతు సంఘాల నాయకులతో చర్చలు జరిపారు. రైతు సంఘాల నాయకులు తమ విశ్లేషణకు అంగీకారం తెలిపారని అధికారులు వివరించారు. కానీ రైతు సంఘాల నాయకులు మాత్రం అధికారులు చెబుతున్న దానిలో నిజం లేదని వివరించారు. అందుకే కేంద్ర ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లు తెలిపారు.
Also Read : Vastu Tips: ఈ మొక్కను క్యాష్ కౌంటర్ వద్ద పెట్టండి.. ఇక డబ్బే డబ్బు..!
బుధవారం రైతు సంఘాలు ఢిల్లీకి పయనమైన నేపథ్యంలో మరోసారి సాధారణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొవచ్చని అధికారులు భావిస్తున్నారు. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) చట్టబద్ధమైన హామీ అంశంపై ఆదివారం చండీగఢ్‌లో రైతు నాయకులు, ముగ్గురు కేంద్ర మంత్రుల మధ్య నాలుగో రౌండ్ సమావేశం జరిగింది. మరో నాలుగు పంటలకు ఎమ్మెస్పీ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది.
వరి, గోధుమలతో పాటు కందులు, ఉసిరి, మొక్కజొన్న, పత్తి పంటలకు కూడా ఎంఎస్‌పీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించగా, ఇందుకోసం రైతులు ఎన్‌సీసీఎఫ్, నాఫెడ్, సీసీఐలతో ఐదేళ్ల ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుంది.ప్రభుత్వం ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోవాలని రైతులు నిర్ణయించారు. ఫిబ్రవరి 21లోగా సమాధానం ఇవ్వాలని రైతులు ప్రభుత్వాన్ని కోరారు. అదే సమయంలో, రైతు సంఘాలు ఇంకా ఉద్యమం ముగింపును ప్రకటించలేదు. అప్పటి నుండి వారు శంభు సరిహద్దు, ఖనౌలీ సరిహద్దుల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టేందుకు సిద్దమయ్యారు.
మరి రైతు సంఘాల నిర్ణయంతో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
Also Read : జమ్మూ కశ్మీర్ లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలు పై 5.5 తీవ్రత నమోదు!