లవర్ లేకుండా ఎలా సాధ్యమైందన్నా!.. ‘బొమ్మరిల్లు’ సాంగ్‏పై ఇంటరెస్టింగ్ కామెంట్స్

అపుడో ఇపుడో ఎపుడో... ఈ పాట గుర్తుంది కదా. బొమ్మరిల్లు సినిమాలో ఈ పాట యూత్ ను ఊపేసింది. ‘లవర్ లేకున్నా ఇంత ఫీల్ గుడ్ మ్యూజిక్ ఎలా ఇచ్చావన్నా’ అంటూ ఓ ఫ్యాన్ దేవిశ్రీప్రసాద్ ను ట్యాగ్ చేస్తూ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, డీఎస్పీ దాన్ని షేర్ చేశాడు.

New Update
లవర్ లేకుండా ఎలా సాధ్యమైందన్నా!.. ‘బొమ్మరిల్లు’ సాంగ్‏పై ఇంటరెస్టింగ్ కామెంట్స్

Devisriprasad: ప్రేమంటె ఏమిటంటే.. నిను ప్రేమించినాక తెలిసే! అంటాడో సినీ కవి. అంటే, ఎవరో ఒకర్ని ప్రేమిస్తే తప్ప ఆ ఫీల్ తెలియదనా? దానర్థం అది కాదేమో! మరి ఏమిటా ‘ఫీల్’ అంటే - తన ప్రేమను కోపంగానో, ద్వేషం గానో, శాపంగానో... ‘చెలియా ఫీల్ మై లవ్’ అంటాడు మరో హీరో. ఎలాగోలా తన ప్రేమను ఫీలవ్వమని ప్రియురాలిని అలా వేడుకుంటున్నాడన్న మాట. అంటే లవ్ చేయకపోయినా ప్రేమను ఫీలవ్వచ్చనే కదా... ఈ డిస్కషన్ ఇప్పుడెందుకంటారా!

అపుడో, ఇపుడో, ఎపుడో కలగన్నానే చెలీ... అందరికీ గుర్తుండే ఉంటుంది. బొమ్మరిల్లులో యూత్‎ను ఉర్రూతలూగించింది ఆ పాట. దానికి మ్యూజిక్ ఇచ్చింది దేవిశ్రీప్రసాద్. ఈ మధ్య ఓ అభిమాని ‘‘లవర్ లేకుండా ఇంత ఫీల్ గుడ్ మ్యూజిక్స్ ఎలా ఇచ్చావన్నా!’’ అని దేవిశ్రీని ట్యాగ్ చేస్తూ ఈ పాట మెలొడియస్ బీజీఎంను ట్విట్టర్‎లో షేర్ చేశాడు. దాన్ని డీఎస్పీ షేర్ చేశాడు. ఫ్యాన్స్ అక్కడికి చేరి ఈ పాటపై ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు