/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/9999.jpg)
Vehicle Fancy No : వాహనాల రిజిస్ట్రేషన్ (Vehicle Registration) కు సంబంధించి ఫ్యాన్సీ నంబర్లకు (Fancy Numbers) విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఈ ఫ్యాన్సీ నెంబర్ల కోసం వాహన యజమానులు పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు పెడుతుంటారు. అయితే ఈ సారి గత రికార్డులన్నింటిని బద్దలు కొడుతూ ఖైరతాబాద్ ఆర్డీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన వేలం పాటలో టీజీ 09 9999 ఫ్యాన్సీ నంబర్ ఏకంగా రూ. 25, 50,002 లకు అమ్ముడుపోయింది.
సోనీ ట్రాన్స్‌పోర్టు సొల్యూషన్స్ (Sony Transport Solutions) దీనిని దక్కించుకుంది. తమ టయోటా ల్యాండ్ క్రూజర్ ఎల్ఎక్స్ కోసం ఈ భారీ మొత్తాన్ని వెచ్చించింది. తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ఒక వాహన ఫ్యాన్సీ నంబర్ ఈ స్థాయి రేటు పలకడం ఇదే తొలిసారి. కాగా ఖైరతాబాద్‌లోని రవాణా కార్యాలయంలో సోమవారం కొత్త సిరీస్ మొదలైంది. ఈ సందర్భంగా ఆన్లైన్ వేలం నిర్వహించారు. టీజీ09 9999 నంబర్‌తో పాటు మరికొన్ని ఫ్యాన్సీ నంబర్లను వేలం పాడారు. దీంతో తెలంగాణ ఆర్టీఏకి ఒకే రోజు ఏకంగా రూ.43,70,284 రాబడి వచ్చిందని అధికారులు వివరించారు.