Electric Two Wheelers : దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు(Electric Scooter), బైక్‌లు-స్కూటీలకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ప్రభుత్వం FAME-II సబ్సిడీ పథకం దీని వెనుక పెద్ద కారణం అని చెప్పవచ్చు. దీనితో పాటు, చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎలక్ట్రిక్ టూ వీలర్స్ కొనుగోలుపై సబ్సిడీని ప్రత్యేకంగా అందిస్తున్నాయి. దీని కారణంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ఒకవేళ మీరు కూడా ఎలక్ట్రిక్ టూ వీలర్ కొనాలని ఆలోచన కనుక చేస్తుంటే.. ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాలపై మీకు ఏ రాష్ట్రంలో అత్యధిక సబ్సిడీ లభిస్తుందో తెలుసుకోవడం సహాయపడవచ్చు. FAME-II సబ్సిడీ దేశవ్యాప్తంగా కేంద్ర అందిస్తోంది. ఇది ఫిక్స్డ్ గా ఉంటుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ రాష్ట్రాలను బట్టి మారుతూ ఉంటుంది. ఇందులో కొన్ని రాష్ట్రాలు ఎక్కువ సడలింపు ఇస్తుండగా, కొన్ని తక్కువ సడలింపు ఇస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు అసలు ఇవ్వడం లేదు కూడా.
FAME-II సబ్సిడీ అంటే ఏమిటి?
ఎలక్ట్రిక్ టూ వీలర్స్, ఫోర్ వీలర్స్ కొనుగోలును ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం FAME-II సబ్సిడీని ప్రారంభించింది. ఈ పథకం ఏప్రిల్ 2019లో ప్రారంభించారు. ఈ ఐదేళ్ల పథకానికి రూ.10,000 కోట్ల బడ్జెట్ సహాయం అందించారు. ఈ వ్యవధి మార్చి 31, 2024తో ముగుస్తుంది. ఈ పథకంలో, ఎలక్ట్రిక్ వాహనం బ్యాటరీ సామర్థ్యం ఆధారంగా ప్రభుత్వం మినహాయింపు ఇస్తుంది. ఫేమ్ II సబ్సిడీ కింద, ఎలక్ట్రిక్ టూ వీలర్‌పై కేంద్ర ప్రభుత్వం రూ. 21,131 రాయితీని ఇస్తుంది.
Also Read: కొత్త సంవత్సరంలో మహిళలకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్..ఆ స్కీమ్ పొడిగించే ఛాన్స్..?
ఇక ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎంత రాయితీ ఇస్తుందో చూద్దాం. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో, ఢిల్లీ(Delhi) ప్రభుత్వం- ఒడిశా ప్రభుత్వం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై భారీగా డిస్కౌంట్ ఇస్తాయి. ఈ రెండు రాష్ట్రాల్లో, FAME-II సబ్సిడీ కాకుండా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ. 17,000 అదనపు సబ్సిడీఅందుబాటులో ఉంది. ఫేమ్ II సబ్సిడీ కాకుండా, అస్సాం ప్రభుత్వం దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన కొనుగోలుపై అత్యధికంగా రూ. 20,000 అదనపు తగ్గింపును అందిస్తుంది.
ఏ రాష్ట్రాల్లో తక్కువ సబ్సిడీ లభిస్తుంది?
FAME-II సబ్సిడీ కాకుండా, పుదుచ్చేరి, గోవా, బీహార్, తెలంగాణ(Telangana), ఆంధ్రప్రదేశ్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ వంటి అనేక ఇతర రాష్ట్రాలలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇతర రాయితీ అందుబాటులో లేదు.
Watch this interesting Video :