Vishaka: ప్రేమ జంట ఘరానా మోసం.. ఖాకీ వేషంలో కోట్లు కొల్లగొట్టారు!

ఓ ప్రేమ జంట నకిలీ పోలీస్ వేశంలో భారీ మోసాలకు పాల్పడింది. నిరుద్యోగులే లక్ష్యంగా పోలీస్ డిపార్ట్ మెంట్ లో జాబ్స్ ఇప్పిస్తామంటూ రమేష్, ప్రవీణలు 30 మంది నుంచి రూ.3 కోట్లకు పైగా వసూల్ చేశారు. విశాఖ నుంచి హైదరాబాద్ పారిపోయిన జంటను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.

New Update
Vishaka: ప్రేమ జంట ఘరానా మోసం.. ఖాకీ వేషంలో కోట్లు కొల్లగొట్టారు!

Fake police: ఖాకీ బట్టలు (Police Uniform) అడ్డుపెట్టుకుని ఓ ప్రేమ జంట ఘరానా మోసాలకు పాల్పడింది. నిరుద్యోగులే లక్ష్యంగా పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మిస్తూ నిండా ముంచింది. ఒకరికి తెలియకుండా మరొకరి నుంచి భారీగా డబ్బు వసూల్ చేయగా ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదుతో అసలు గుట్టు బయటపడింది. ఈ సంఘటన ఏపీలోని విశాఖజిల్లాలో చోటుచేసుకోగా ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

పోలీసుల గెటప్..
ఈ మేరకు విశాఖ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. CRPFలో ఉద్యోగం చేస్తూ సస్పెండ్‌ అయ్యాడు ప్రధాన నిందితుడు హనుమంతు రమేష్(47). ఈ క్రమంలోనే తరుచు మోసాలతోనే బతికుతూ అడవివరంలోని ఆర్ఆర్ టవర్స్ లో ఉంటున్నాడు. ఇతనికి ఇద్దరు భార్యలు (వారిద్దరూ అక్కచెల్లెలు) ఉండగానే.. ఇటీవలే మరో మహిళ ప్రవీణతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో వీరిద్దరూ కొంతకాలంగా రాష్ట్ర పోలీసు శాఖలో ఉన్నత ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ యువతీయువకులను నమ్మించారు. ఈ ముఠాకు పలువురు మధ్యవర్తులు సహకరించగా.. హనుమంతు అతని ప్రియురాలు పోలీసుల గెటప్ లో బాధితులను కలుస్తుండగా గుడ్డిగా నమ్మేశారు. ఈ క్రమంలోనే దాదాపు 30 మంది దగ్గర రూ.3 కోట్ల వరకు వసూల్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి: loksabha: లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ఖరారు.. ఉద్యోగులకు సెలవులు రద్దు!

పెందుర్తి పీఎస్‌లో ఓ యువతి ఫిర్యాదు..
అయితే డబ్బు ముట్టినప్పటికీ ఉద్యోగానికి సంబంధించి ఎలాంటి సమాచారం అందకపోవడంతో విశాఖ పెందుర్తి పీఎస్‌లో ఓ యువతి ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన నగర పోలీసులు నిందితులు విశాఖనుంచి హైదరాబాద్ పారిపోయినట్లు గుర్తించి టాస్క్ ఫోర్స్ బృందాలతో కలిసి హనుమంతు రమేష్ అతడి ప్రియురాలిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ దొంగలను నగర పోలీసు కమిషనర్ ఎదుట హాజరుపరిచినట్లు చెబుతూ కేసుకు సంబంధించి పూర్తి విచారణ చేపట్టిన తర్వత మిగతా వివరాలు వెల్లడిస్తామన్నారు.

Advertisment
తాజా కథనాలు