Pensions Cut: పెన్షన్ దారులకు బిగ్ షాక్.. వారందరికీ పెన్షన్లు కట్! ఏపీలో ఫేక్ దివ్యాంగుల పెన్షన్లను తొలగించేందుకు చంద్రబాబు సర్కార్ సిద్ధమైంది. దివ్యాంగుల కోటలో 8 లక్షల మంది పెన్షన్ తీసుకుంటుండగా 60 వేల మందికి మరోసారి వైకల్య నిర్ధారణ పరీక్షలు నిర్వహించబోతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే పలువురికి నోటీసులు జారీ చేశారు. By srinivas 21 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి AP News: ఏపీలో చంద్రబాబు సర్కారు సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. పలు కేటగిరీల పెన్షన్ దారులకు బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 67 లక్షల మంది పెన్షన్ తీసుకుంటుండగా.. దివ్యాంగుల కోటలో 8 లక్షల మందికి పెన్షన్ అందుతోంది. అయితే ఈ దివ్యాంగుల జాబితాలో చాలామంది ఫేక్ సర్టిఫికెట్లతో పెన్షన్ తీసుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాదు వారందరికీ ఇప్పటికే నోటీసులు జారీ చేయగా.. వారి పెన్షన్లు కట్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. 60 వేల మందికి పైగా సదరం క్యాంపు ఏర్పాటు చేసి వైకల్య నిర్ధారణ పరీక్షలు నిర్వహించబోతున్నట్లు అధికారులు వెల్లడించారు. నకిలీ సర్టిఫికెట్లతో వచ్చే పెన్షన్ దరఖాస్తులను పక్కన పెట్టాలని మంత్రి బాలవీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. #ap-cm-chandrababu #fake-disabled-pension మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి