Fake Currency: నకిలీ కరెన్సీ చలామణీకి యత్నం.. గుట్టు రట్టు చేసిన ఎన్‌ఐఏ

భారీ నకిలీ కరెన్సీ నోట్ల రాకెట్‌ను ఎన్‌ఐఏ ఛేదించింది. నాలుగు రాష్ట్రాల్లో శనివారం చేఇసన దాడుల్లో ఎన్‌ఐఏ (NIA) కరెన్సీ నోట్లతో పాటు ప్రింటింగ్‌ మిషన్లు, పేపర్‌ను స్వాధీనం చేసుకుంది. వివిధ రాష్ట్రాల్లో వాటిని చలామణీ చేయడానికి నిందితులు కుట్రపన్నారని అధికారులు తెలిపారు.

Fake Currency: నకిలీ కరెన్సీ చలామణీకి యత్నం.. గుట్టు రట్టు చేసిన ఎన్‌ఐఏ
New Update

Fake Currency: భారీ నకిలీ కరెన్సీ నోట్ల రాకెట్‌ను ఎన్‌ఐఏ ఛేదించింది. నాలుగు రాష్ట్రాల్లో శనివారం చేఇసన దాడుల్లో ఎన్‌ఐఏ (NIA) కరెన్సీ నోట్లతో పాటు ప్రింటింగ్‌ మిషన్లు, పేపర్‌ను స్వాధీనం చేసుకుంది. రూ.500, రూ.200, రూ.100 నకిలీ నోట్లను అధికారులు సోదాల్లో గుర్తించారు. సరిహద్దుల ద్వారా వాటిని రవాణా చేసి, వివిధ రాష్ట్రాల్లో చలామణీ చేయడానికి నిందితులు కుట్రపన్నారని తెలిపారు.

ఇది కూడా చదవండి: గడ్డం తీసేసే టైమొచ్చింది.. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట్రస్టింగ్ కామెంట్స్

పక్కా సమాచారం ప్రకారం ఎన్‌ఐఏ సిబ్బంది వివిధ రాష్ట్రాల్లో కీలక ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. మహారాష్ట్ర కొల్హాపూర్ జిల్లా రాహుల్ తానాజీ పాటిల్, యవత్మాల్ జిల్లాలోని శివ పాటిల్, ఉత్తరప్రదేశ్‌ షాజహాన్‌పూర్ జిల్లాలో వివేక్ ఠాకూర్, కర్ణాటక బళ్లారి జిల్లాలో మహేందర్, బీహార్‌ రోహ్తాస్ జిల్లాలో శశిభూషణ్ ఇళ్ల నుంచి నకిలీ కరెన్సీ నోట్లను స్వాధీనపరచుకున్నారు.

వారిలో శివపాటిల్ అనే వ్యక్తి ఇతర వ్యక్తులు కొందరితో కలిసి భారత్‌లో చలామణీ చేయడానికి ఇతర దేశాల నుంచి నకిలీ కరెన్సీ, ప్రింటింగ్ మిషన్లను సేకరించినట్లు దర్యాప్తులో ఎన్‌ఐఏ అధికారులు తేల్చారు. నకిలీ కరెన్సీ సరఫరాకు కుట్రపన్నిన నిందితులు మోసపూరితంగా పొందిన సిమ్ కార్డులు ఉపయోగించారని తెలిపారు.

#nia #fake-currency
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe