/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-22-4.jpg)
Vikarabad : నకిలీ విత్తనాలు (Fake Seeds) దొరకడం కలకలం రేపింది. వికారాబాద్ జిల్లా ఎక్ మై గ్రామంలో 415 కిలోల నకిలీ పత్తి విత్తనాలను (Cotton Seeds) తరలిస్తున్నవెంకట్ రాములు, బోయిని విఠలప్పలను పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read : ప్రధాని నెహ్రూకు పూలమాల.. 15 ఏళ్ల బాలికను ఆ ఊరు ఏం చేసిందంటే!
ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం ఈర్లపల్లి గ్రామానికి చెందిన చిన్న గుంట వెంకట్ రాములు వ్యక్తి దగ్గర కర్ణాటక రాష్ట్రం మదిగంటి గ్రామానికి చెందిన బోయిని విఠలప్ప 415 కిలోల నకిలీ పత్తి విత్తనాలను కొనుగోలు చేశాడు. తర్వాత వాటిని బషీరాబాద్ మండలంలోని వివిధ గ్రామాలలో అమ్మేందుకు వస్తున్న క్రమంలో స్థానికుల సమాచారంతో ఇద్దరిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశాం. తక్కువ ధర కు విత్తనాలు వస్తున్నాయంటూ నకిలీ విత్తనాలను కొనుగోలు చేసి రైతులు (Farmers) మోసపోవద్దని, ఇలాంటి నకిలీ విత్తనాలు అమ్మేవారు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.