టూవీలర్ డీజిల్ వాహనాలు ఎందుకు తయారు చేయరో మీకు తెలుసా..? By Shareef Pasha 16 Jun 2023 in Uncategorized New Update షేర్ చేయండి ఎప్పుడు చూడు అవే పెట్రోల్ బైకులు, అవే పెట్రోల్ స్కూటీలు.. వాడిన బైక్‌లు వాడడం వల్ల మీకు బోరు కొడుతుందా..? ఈ కంపెనీలు డీజిల్ టూవీలర్స్ ని తయారు చేయొచ్చు కదా అని ఎప్పుడైనా మీకు అనిపించిందా? ఈ పెట్రోల్ రేట్లు కంటే డీజిల్ రేట్లు తక్కువ ఉంటాయి. కాబట్టి డీజిల్ బైక్స్ వస్తే కొనుక్కోవచ్చునని ఎప్పుడైనా అనిపించిందా? డీజిల్ బైక్ అయితే చాలా డబ్బు ఆదా అవుతుంది. లీటర్ పెట్రోల్ రూ. 110 ఉంటే, డీజిల్ రూ. 98 రూపాయలు ఉంటుంది. లీటర్ మీద రూ. 12 ఆదా అవుతుంది. ఈ లెక్కన 10 లీటర్ల మీద రూ. 120 ఆదా చేసుకోవచ్చు. ఈ పెట్రోల్ భారాన్ని మోయలేకే కొంతమంది ధర ఎక్కువైనా సరే డీజిల్ కార్లను కొనుక్కుంటున్నారు. కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టే డీజిల్ బైక్స్ ని తయారు చేయడం లేదా అంటే కాదు. దానికి వేరే కారణాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. డీజిల్ ఇంజన్ 24:1 కంప్రెషన్ రేషియో కలిగి ఉంటుంది. పెట్రోల్ ఇంజన్ అయితే 11:1 కంప్రెషన్ రేషియో కలిగి ఉంటుంది. పెట్రోల్ ఇంజన్ తో పోలిస్తే డీజిల్ ఇంజన్ చాలా ఎక్కువ. ఈ భారీ కంప్రెషన్ రేషియోని హ్యాండిల్ చేయాలంటే డీజిల్ ఇంజన్ బాహుబలిలో ప్రభాస్ లా మాంచి దిట్టంగా ఉండాలి. పెద్దగా ఉండాలి, అలానే బరువైన మెటల్ తో తయారు చేయాలి. అందుకే డీజిల్ ఇంజన్లు పెట్రోల్ ఇంజన్లతో పోలిస్తే హెవీగా ఉంటాయి. అందుకే ఇవి చిన్న వాహనాల్లో పెట్టడానికి కుదరదు. ఈ అధిక కంప్రెషన్ రేషియో కారణంగా డీజిల్ ఇంజన్లు అధిక వైబ్రేషన్ ని, శబ్దాన్ని ఉత్పత్తి చేస్తాయి. పెట్రోల్ ఇంజన్ తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. బైకుల్లో వాడేవి లైట్ వెయిట్ ఇంజన్లు. వీటికి ఈ వైబ్రేషన్ ని, శబ్దాన్ని తట్టుకునే శక్తి ఉండదు. అందుకే వీటిని తట్టుకునే విధంగా హెవీ మెటల్ తో చేసిన ఇంజన్లను వాడతారు. పెట్రోల్ ఇంజన్ తో పోలిస్తే డీజిల్ ఇంజన్ ఒక గాలన్ కి 13 శాతం అధిక కార్బన్ డయాక్సయిడ్ ని ఉత్పత్తి చేస్తుంది. దీని వల్ల కాలుష్యం పెరిగిపోతుంది. పెట్రోల్ ఇంజన్లతో పోలిస్తే ఈ కాలుష్యం చాలా ఎక్కువ. అది పర్యావరణానికి అంత మంచిది కాదు. అందుకే బైకులు, స్కూటీల్లో డీజిల్ ఇంజన్లను పెట్టరు. మరి డీజిల్ కార్లు వాడితే నష్టం కదా బోరో అని ఫీలవుతున్నారా? కానీ పెట్రోల్ వాహనాలతో పోలిస్తే డీజిల్ వాహనాలు కొనేవారు చాలా తక్కువ. పైగా బైకులు, స్కూటీలు కొనే సామాన్యులు చాలా మంది ఉన్నారు. ధనవంతులు కూడా కార్లు ఉన్నా బైకులు కొనుక్కుంటారు. వీటిని కనుక డీజిల్ తో తయారు చేస్తే కాలుష్యం మరింత పెరిగిపోతుంది. ప్రతి ఏటా కోటిన్నర ద్విచక్ర వాహనాలు అమ్ముడవుతున్నాయి. ఇవి కనుక డీజిల్ తో చేసిన బండ్లు అయితే ఫలితం ఎంత తీవ్రంగా ఉంటుందో ఆలోచించండి. ఇక డీజిల్ ఇంజన్లు బైకుల్లో పెట్టకపోవడానికి మరొక కారణం ధర. అధిక కంప్రెషన్ రేషియో, హెవీ ఇంజన్ కారణంగా డీజిల్ ఇంజన్ ధర పెట్రోల్ ఇంజన్ కంటే ఎక్కువగా ఉంటుంది. రెండిటికీ రూ. 50 వేలు వ్యత్యాసం ఉంటుంది. టూవీలర్‌కు ఇది సూటవ్వదు. ఇప్పటికే ఒక బైక్ కి లక్ష రూపాయలు అవసరమా అని ఆలోచిస్తున్నారు చాలా మంది. అటువంటి సమయంలో డీజిల్ బైక్ కి 50 వేలు ఎగస్ట్రా పెట్టడం అంటే ఆమ్మో ఒకటో తారీఖు గుర్తొస్తుంది. దీని కంటే ఎలక్ట్రిక్ వాహనం కొనుక్కోవడం నయం అనిపిస్తుంది. ఎందుకంటే పెట్రోల్ భారం ఉండదు. అప్పుడు పెట్రోల్ బైకుల సేల్స్, పెట్రోల్ బంకుల బిజినెస్ దెబ్బ తింటుంది. డీజిల్ బైక్ కోరుకోవడం వల్ల ఇంత అనర్థం అవసరమా అని మీకు అనిపించొచ్చు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి