/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/facial-recognsation-jpg.webp)
Facial Recognition: ఆన్‌లైన్‌లో అశ్లీల చిత్రాలు ఎగబడి చూసేవాళ్లని ఎలా ఆపాలో అర్ధం కాక ప్రభుత్వాలన్నీ జుట్టు పీక్కుంటున్నాయి. చట్టపరంగా చాలా సైట్లు బ్యాన్ చేస్తున్నా.. కొత్త పేర్లతో అంతర్జాల ప్రపంచంలోకి వస్తూనే ఉన్నాయవి. పోర్న్ ప్రియులు కూడా ఏదో ఒక విధంగా వాటిని చూస్తూనే ఉన్నారు. ముఖ్యంగా 18 ఏళ్ల వయసు లోపు యువత వీటిని చూడకుండా ఆపడంలో ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయి. సరైన రెగ్యులేషన్ లేకపోవడం వల్లే ఈ పరిస్థితి అనేది స్పష్టంగా తెలిసిన విషయమే. ఆ సైట్లు ఓపెన్ చేయాలంటే..18 ఏళ్లు నిండినవాళ్లో కాదో మ్యాన్యువల్‌గా పాప్-అప్ బటన్ నొక్కితే చాలు సరిపోతుంది. ఎంత వయసు వాళ్లయినా 18 ఏళ్లు నిండాయనే బటన్ ప్రెస్ చేసి..ఎంచక్కా అశ్లీల వీడియోలు ఎంజాయ్ చేస్తున్నారు.
Also Read: శ్రీలీలపై కన్నేసిన యంగ్ హీరో.. ఈవెంట్ ల్లో తెగ పొగిడేస్తున్నాడే!
మరోవైపు అశ్లీల చిత్రాలు చూడటం వల్లే మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని, బాల్యంలోనే చాలా మందిలో పెడధోరణి పెరిగిపోతోందనే వాదన ఎప్పటినుంచో ఉంది. అందుకే 18 ఏళ్ల లోపు యువతని అశ్లీల చిత్రాలకు దూరంగా ఉంచేందుకు అన్ని దేశాలు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా యునైటెడ్ కింగ్‌డమ్ ఆన్‌లైన్ సేఫ్టీ యాక్ట్‌లో పలు సవరణలు ప్రతిపాదించింది. ముఖ్యంగా ఫేషియల్ రికగ్నిషన్ ఉండాలన్నది ఇందులో ఒక సవరణ. దాంతో పాటు క్రెడిట్ కార్డ్ వివరాలు, బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఫోన్ నెంబర్ కూడా తప్పనిసరిగా ఇవ్వాలట. ఈ రూల్స్‌ని త్వరలోనే చట్టబద్ధం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
Also Read: నానితో రొమాన్స్.. అనుకున్నదానికంటే ఎక్కువే అయినా బాగుంది: మృణాల్
ఈ నిబంధనలు పాటించని పోర్న్ సైట్ల సంవత్సర ఆదాయంలో 10 శాతం ఫైన్ విధించేలా చట్టంటో పొందుపరుస్తున్నారు. దాంతో పాటు యూకేలో శాశ్వతంగా ఆ సైట్‌ని బ్లాక్ చేయడం లేదా సంస్థ ప్రతినిధులపై క్రిమినల్ కేసులు పెట్టేలా చట్టాన్ని రూపొందిస్తున్నారు. భారతదేశంలో కూడా కేంద్రప్రభుత్వం ఇలాంటి ప్రతిపాదన తీసుకొస్తే బాగుంటుందన్న వాదన వినిపిస్తోంది.