Tulsi Leaves: చిన్న ఆకుతో ముఖంపై ముడతలన్నీ మాయం..మెరవడం ఖాయం

తులసి ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మెరిసే చర్మం కోసం తులసిని వాడవచ్చని నిపుణులు చెబుతున్నారు. తులసిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మొటిమలు, మచ్చలను తొలగించడంలో సహాయపడతాయి. తులసి ఆకుల ఫేస్ ప్యాక్ ఎలా వాడలో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
Tulsi Leaves: చిన్న ఆకుతో ముఖంపై ముడతలన్నీ మాయం..మెరవడం ఖాయం

Tulsi Leaves:తులసి ఆకులను ఆయుర్వేద చికిత్సకు ఉపయోగిస్తారు. అంతేకాకుండా తులసి ముఖానికి చాలా మేలు చేస్తుంది. మెరిసే చర్మం కోసం తులసిని వాడవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ముఖం ముడతలను తగ్గించడంలో కూడా బాగా పనిచేస్తుందని అంటున్నారు. ముఖంపై మచ్చలు మన అందాన్ని తగ్గిస్తాయి. దీని వల్ల ముఖం అందవిహీనంగా కనిపిస్తూ ఉంటుంది. చాలా మంది ఈ విషయంలో ఆందోళన చెందుతుంటారు. తులసి ఆకులను ఉపయోగించి ముఖాన్ని మెరిపించవచ్చు. తులసి ఒక పూజ్యమైన మొక్క. ఇది ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చర్మానికి అమృతం కూడా. తులసిలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. తులసి ఆకులు అనేక ముఖ సమస్యలను తొలగించడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. తులసి ఆకులతో టీ చేసుకోవచ్చని, డైరెక్ట్‌గా తినవచ్చని అంటున్నారు.

మరకలు సైతం మాయం:

తులసిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మొటిమలు, మచ్చలను తొలగించడంలో సహాయపడతాయి. తులసి ఆకులు కూడా ముఖం వాపును తగ్గిస్తాయి. తులసి ఆకు ముఖం యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుంది. ముఖంపై ముడుతలను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. తులసి ఆకులను అనేక విధాలుగా ఉపయోగించవచ్చు. తులసి ఆకుల రసాన్ని తీసి ముఖానికి రాసుకోవచ్చు. అలాగే అందులో నిమ్మరసం, తేనె మిక్స్ చేసి ముఖానికి రాసుకోవచ్చు. తులసి ఆకులను గ్రైండ్ చేసి, పెరుగు, శెనగపిండి లేదా తేనెతో కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేసి ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత కడిగేయండి. ముఖంపై ఎర్రటి దద్దుర్లు లేదా అలెర్జీ లాంటి లక్షణాలు ఉంటే ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు అంటున్నారు.

ఇది కూడా చదవండి: సబ్బుకు బదులు ఇవి వాడండి.. ముఖం మెరిసిపోతుంది

గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు