Hair Fall Tips : వేసవికాలం లో అందరూ ప్రధానంగా ఎదుర్కొనే సమస్యలలో జుట్టు రాలే సమస్య ఒకటి. వేసవికాలం(Summer Season) లో విపరీతమైన చెమట పట్టడం వల్ల జుట్టు రాలిపోతుంది. చెమట కారణంగా ఎక్కువగా తలస్నానం చేయడం వల్ల కూడా జుట్టు రాలిపోతుంది. అసలు వేసవి కాలంలో జుట్టు సంరక్షణ కోసం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వేసవిలో జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
వేసవిలో జుట్టు ఆరోగ్యం కోసం వేసవి కాలంలో చర్మం డిహైడ్రేట్(Dehydrate) అవుతుంది. ఈ కారణంగా చర్మంతో పాటు, జుట్టు కుదుళ్ళు కూడా పొడి బారిపోతాయి. దీంతో జుట్టు రాలిపోతుంది. దీనిని నివారించేందుకు నీళ్లను బాగా తాగాలి. దీంతో జుట్టు హైడ్రేట్ అవుతుంది. వేసవి కాలంలో సూర్యుడు నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలు వెంట్రుకలను పాడుచేస్తాయి .దీనిని నివారించడానికి హెయిర్ సన్ స్క్రీన్ అప్లై చేయడం మంచిది.
ఇలా చేస్తే జుట్టు ఊడిపోతుంది లేదంటే క్యాప్ ని కానీ, స్కార్ఫ్ కానీ ధరించి బయటకు వెళ్లడం మంచిది. వేసవికాలంలో జుట్టును స్టైల్ గా తయారు చేయడం కోసం చాలామంది స్ట్రైట్నర్ లను యూజ్ చేస్తారు. అంతేకాదు హెయిర్ డ్రయర్లను కూడా ఉపయోగిస్తారు. అసలే ఎండాకాలం.. ఆపై హీట్ స్టైలింగ్ పేరుతో హీట్ పరికరాలను ఉపయోగిస్తే జుట్టు పాడవుతుంది. ఫలితంగా జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది. ఇలా చేస్తే జుట్టు పాడవుతుంది జాగ్రత్త వేసవిలో వేడి వల్ల కుదుళ్లలో నేచురల్ ఆయిల్స్ తగ్గిపోయి, జుట్టు పొడిబారుతుంది. దీనిని తగ్గించడం కోసం వారానికి రెండు సార్లు డీప్ కండిషనింగ్ చేయడం మంచిది. ఇక చాలామంది వేసవికాలంలో స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు. స్విమ్మింగ్ చేయడం వల్ల కూడా జుట్టు బాగా ఊడిపోతుంది. స్విమ్మింగ్ పూల్స్ లో ఉండే వాటర్ లో క్లోరిన్ కలుపుతారు, దీనివల్ల కూడా జుట్టు పాడవుతుంది.
Also Read : వీటిని ఒక గ్లాసులో రాత్రంతా నానబెట్టి, ఉదయం ఖాళీ కడుపుతో తాగండి.. రిజల్ట్ మీకే అర్థమవుతుంది
జడ ఇలా వేసుకోవాలి వేసవిలో జుట్టు కొసలు తొందరగా పొడిబారిపోయి చిట్లి పోతాయి. దీనివల్ల కూడా జుట్టు రాలే సమస్య బాగా పెరుగుతుంది. దీనిని నివారించేందుకు వేసవిలో తరచూ వెంట్రుకలను ట్రిమ్ చేయడం మంచిది. ఇక వేసవిలో జడ బాగా టైట్ గా వేసుకుంటే కూడా జుట్టు రాలే సమస్య పెరుగుతుంది. అందుకే వేసవిలో లూజ్ గా జడ వేసుకోవాలి.
జుట్టు రాలకుండా(Hair Fall) ఇలా చెయ్యండి సమతుల్య ఆహారం తీసుకోవడం, తాజా పండ్లు కూరగాయలను తినడం, పండ్ల రసాలను తాగడం వంటివి చేయడం వల్ల జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. జుట్టు ఆరోగ్యం కోసం వారానికి రెండు సార్లు నూనెతో మసాజ్ చేసుకోవడం మంచిది. దీంతో రక్తప్రసరణ పెరిగి జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది.