Union Budget 2024: 2024-25 పూర్తి బడ్జెట్‌ను సమర్పిస్తున్నప్పుడు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) కొత్త ఆదాయపు పన్ను విధానంలో అనేక ముఖ్యమైన మార్పులు చేశారు. ఒకవైపు స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని పెంచగా, మరోవైపు పన్ను శ్లాబ్‌ను కూడా మార్చారు. ఇప్పుడు మధ్యతరగతి వర్గాలకు ఇది ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు కానీ.. ఆ బాధను మరచిపోయేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దేశవ్యాప్తంగా మద్యం ధరలను తగ్గించే విధంగా బడ్జెట్‌లో మార్పు వచ్చింది.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగాన్ని సమర్పించినప్పుడు, ప్రత్యక్ష పన్ను (ఆదాయపు పన్ను)తో పాటు, ఆమె అనేక పరోక్ష పన్నుల (కస్టమ్స్ డ్యూటీ మరియు GST మొదలైనవి) గురించి కూడా మాట్లాడారు. ఇందులో మద్యం చౌకగా లభించేలా ఒక్క నిబంధన ఉంది.
ENA పై సెంట్రల్ జీఎస్టీ ఉండదు..
మానవ వినియోగం కోసం ఆల్కహాలిక్ పానీయాలను తయారు చేయడంలో ఉపయోగించే ముఖ్యమైన పదార్థాన్ని ENA అని పిలుస్తారు. అంటే ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్. సెక్షన్ 9ని సవరించడం ద్వారా ప్రభుత్వం ఇప్పుడు దానిని సెంట్రల్ జీఎస్టీ పరిధి నుంచి తప్పించింది. ఇది మాత్రమే కాదు, దీని కోసం, CGST తో పాటు, ఇంటిగ్రేటెడ్ GST (IGST) కేంద్ర పాలిత ప్రాంతాల GST (UTGST) లలో కూడా అవసరమైన మార్పులు చేయాలని ప్రభుత్వం తెలిపింది.
Union Budget 2024: ఇలా చేయడం ద్వారా ప్రభుత్వం ఇప్పుడు దేశంలో అంతర్గత వాణిజ్యం.. విదేశాల నుండి దిగుమతి చేసుకునే ENA ఖర్చును తగ్గిస్తుంది. అయితే దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయనేది జీఎస్టీ కౌన్సిల్ తదుపరి సమావేశంలో తేలనుంది. ఖర్చు తగ్గింపు వల్ల ప్రజల జేబుల్లోకి ఎంత ప్రయోజనం చేరుతుందో అప్పుడే తెలుస్తుంది.
ఈఎన్‌ఏపై పన్ను రద్దు తర్వాత మద్యం చౌకగా మారుతుంది
Union Budget 2024: ఈఎన్‌ఏపై పన్ను రద్దు చేయడం వల్ల సామాన్యులకు లభించే మద్యం ధర ఎలా తగ్గుతుంది అని మీకు సందేహం రావచ్చు. జిఎస్‌టి చట్టంలో ఒక నిబంధన ఉంది. భుత్వం ఏదైనా వస్తువుపై జిఎస్‌టి తగ్గిస్తే అప్పుడు దాని ప్రయోజనాలను ప్రజలకు విస్తరించడంతప్పనిసరి అని ఆ నిబంధన చెబుతుంది. అందువల్ల ఇప్పుడు ప్రభుత్వం ఈఎన్‌ఏపై పన్నును తొలగిస్తే మద్యం తయారీ కంపెనీల ధరలు తగ్గుతాయి. దీని ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేయాల్సి ఉంటుంది.
ఆగండాగండి అయిపోలేదు.. ఇక్కడ ఇంకో తిరకాసు కూడా ఉంది.. అదేంటంటే, ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మద్యంపై పన్ను రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోకి కూడా వస్తుంది. అటువంటి పరిస్థితిలో, దానిపై అదనపు పన్ను విధించవచ్చు లేదా కేంద్ర ప్రభుత్వం తగ్గించిన పన్నునే విధించడం ద్వారా మద్యం ధరలను అదే స్థాయిలో ఉంచవచ్చు. ఒకవేళ ఆ టాక్స్ రాష్ట్రప్రభుత్వాలు తగ్గించాయని అనుకుంటే.. మందుబాబులకు తక్కువ ధరల్లోని మద్యం దొరుకుతుంది. రాష్ట్రాలు మేమివ్వం.. అని అన్నయ్యని అనుకోండి.. అప్పుడు రాష్ట్ర ఖజానాలకు మరింత ఆదాయం మందు ద్వారా వచ్చిపడుతుంది. రెండిటిలో ఏది జరిగినా మంచిదే కదా!