/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-68.jpg)
Illicit Relationship: ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో ఇద్దరు పోలీసు అధికారులు అక్రమ సంబంధం పెట్టుకున్న ఘటన సంచలనంగా మారింది. ఆగ్రా కమిషనరేట్ లోని సిటీ జోన్‌కు చెందిన మహిళా ఇన్‌స్పెక్టర్ శైలీ రాణా, ముజఫర్ నగర్ జిల్లాలోని పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్‌తో వివాహేతరం సంబంధం పెట్టుకున్నారు. ఈ తతంగాన్ని కొంతకాలంగా కనిపెడుతున్న భార్య శనివారం మధ్యాహ్నం వారిద్దరూ ఏకాంతంగా ఉన్నప్పడు బంధువులతో కలిసి పట్టుకుంది. ఇద్దరినీ ఇంటినుంచి బటయకు తీసుకొచ్చి చితకబాదింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా వివారాలు ఇలా ఉన్నాయి.
Extra-Marital affair Kalesh (In Agra, a male inspector was caught "red handed" in the room of a female inspector)
pic.twitter.com/U19RpAJpvm— Ghar Ke Kalesh (@gharkekalesh) August 3, 2024
ఈ మేరకు అగ్రా ప్రభుత్వ పోలీస్ క్వార్టర్‌లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుండగా.. రకబ్ గంజ్ పోలీస్ స్టేషన్ కు చెందిన మహిళా ఇన్‌స్పెక్టర్ శైలీ రాణా కొంతకాలంగా అక్కడే ఒంటరిగా ఉంటున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసు అధికారులు ఇంతవరకు స్పందించలేదు. ప్రభుత్వ క్వార్టర్స్ ముందు జరిగిన రచ్చకు సంబంధించి ఎటువంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోకపోవడం విశేషం. కాగా దీనిపై పలువురు నెటిజన్లు భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే అంతే.. డీఎస్పీ హెచ్చరిక