ఆ రోజు వరకు ఈ రైళ్లు రద్దు..!!

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. దసరాకు మరో 9 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. రేపు నాందేడ్-కాకినాడ మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్నట్టు ప్రకటించింది. 24న హైదరాబాద్-కటక్, 25న కటక్-హైదరాబాద్ మధ్య రైళ్లు తిరగనున్నాయని రైల్వే శాఖ పేర్కొంది. మరోవైపు, నిర్వహణ పరమైన కారణాలతో కాచిగూడ-రాయచూర్ (17693), రాయచూర్-కాచిగూడ(17694) మధ్య రైళ్లను రద్దు చేశారు. నేటి నుంచి ఈ నెల 25 వరకు ఈ రైళ్లను రద్దు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.

New Update
MMTS Trains: రెండు రోజుల పాటు ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు!

Special Trains: దసరా సమీపిస్తున్న వేళ రైల్వే  ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే మరో గుడ్‌న్యూస్ చెప్పింది. దసరా పండుగ కోసం అందరు తమ తమ సొంత ఊర్లకు వెళ్తుండడంతో ఇప్పటికే వేసిన ప్రత్యేక రైళ్లు కూడా  నిండిపోతున్నట్లు తెలుస్తోంది. దీంతో మరో 9 రైళ్లను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. రేపు నాందేడ్ నుంచి కాకినాడకు ప్రత్యేక రైలు నడుపుతున్నట్టు ప్రకటించింది. ఈ రైలు (07061) నాందేడ్ లో  బయలుదేరి నిజామాబాద్, సికింద్రాబాద్, నల్గొండ మీదుగా కాకినాడకు చేరుకుంటుంది.

24న హైదరాబాద్-కటక్(07165) రైలును ప్రకటించింది. ఇది నల్గొండ, గుంటూరు, విజయవాడ, దువ్వాడ తదితర స్టేషన్ల మీదుగా నడుస్తుందని రైల్వే శాఖ తెలిపింది. 25న కటక్-హైదరాబాద్‌(07166) మధ్య మరో రైలు నడుస్తుందని, ఈ రైలు కూడా ఇదే మార్గంలో ప్రయాణిస్తుందని అధికారులు తెలిపారు. మిగిలిన ప్రత్యేక రైళ్లు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణించవని అధికారులు పేర్కొన్నారు.

Also Read: ఓట్ల కోసం దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు: షర్మిల

మరోవైపు, నిర్వహణ పరమైన కారణాలతో కాచిగూడ-రాయచూర్ (17693), రాయచూర్-కాచిగూడ(17694) మధ్య రైళ్లను రద్దు చేశారు. నేటి నుంచి ఈ నెల 25 వరకు ఈ రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. రైలు ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయ రైళ్లు, మార్గాలు ఎంచుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు