Scholarship : తెలంగాణ విద్యార్థులకు రేవంత్ సర్కార్ మరో శుభవార్త చెప్పింది. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన స్టైఫండ్, ట్యూషన్ ఫీజుల అప్లికేషన్ గడువును పొడిగిస్తు్న్నట్లు చెబుతూ ఎస్సీ సంక్షేమశాఖ అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ స్కాలర్ షిప్ లకోసం దరఖాస్తు తుది గడువు డిసెంబర్ 31 వరకూ నిర్ణయించగా.. 4 లక్షలమంది విద్యార్థులు మాత్రమే అప్లై చేసుకున్నారని, దీంతో ఫ్రొఫెషనల్ కోర్సుల ప్రవేశాల ప్రక్రియ ఆలస్యం కావడంతో దరఖాస్తు గడుపు పొడిగిస్తు్న్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
ఈ మేరకు బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల కోసం ప్రభుత్వం స్కాలర్‌షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎస్సీ సంక్షేమశాఖ మంజూరు చేస్తోంది. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల ద్వారా విద్యార్థులకు 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి దరఖాస్తులు చేసుకోవాలని సూచించి రెండు నెలలు గడుస్తున్నా.. 25 శాతం మంది విద్యార్థులు కూడా ముందుకు రాలేదని సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు. దీంతో గతంలో ఇచ్చిన డిసెంబరు తుది గడువను మరోసారి పొడిగిస్తూ.. మరో 3 నెలలపాటు ఈ స్కాలర్ షిప్ లకు విద్యార్థులు అప్లై చేసుకోవాలని, ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి : Shri Chaitanya: శ్రీ చైతన్య స్కూల్ నిర్వాకం.. విద్యార్థి కాలు విరగొట్టిన ఉపాధ్యాయుడు
అలాగే ఈ అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలని, దరఖాస్తుల సంఖ్యను పెంచేందుకు ఇప్పటికే కళాశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లకు లేఖలు రాశామని చెప్పారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యాలు దరఖాస్తులు సమర్పించే విషయంలో అలసత్వం ఉండొద్దని కోరారు. ఇక గతేడాది దరఖాస్తు చేసుకున్న 18,085 మంది విద్యార్థులు రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంది. వారిలో ఇప్పటివరకు 11,284 మంది మాత్రమే చేసుకున్నారు. ఫ్రెష్ విభాగంలో 4శాఖల నుంచి కేవలం 7వేల మందికి పైగా దరఖాస్తులు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. 2023–24 విద్యాసంవత్సరంలో ఈపాస్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసే విద్యార్థులకు కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయని, ఆధార్ కార్డులో ఉన్న పేరులో చిన్నచిన్న అక్షర దోషాలు ఉండడంతో.. సైట్ దాన్ని స్వీకరించడం లేదు. వీటితో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకునే విద్యార్థులు పూర్తిస్థాయిలో బ్యాంకు ఖాతాలు కలిగి ఉండకపోవడం, పదోతరగతి మెమోలు ఆన్‌లైన్ చేయకపోవడం, కళాశాలల యాజమాన్యాల నిర్లక్ష్యం, దరఖాస్తు గడువు పొడిగిస్తారనే ఉదాసీనత తోడయ్యాయి. మరోవైపు ఆయా సంక్షేమ శాఖలు కూడా విద్యార్థులను చైతన్యం చేయడంలో కొంత విఫలమయ్యాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.