నాగ్‌పూర్‌లో ఘోర ప్రమాదం.. సోలార్ బూస్టర్ ప్లాంట్ పేలి 9మంది మృతి మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. బజార్ గాన్ లోని ఒక సోలార్ కంపెనీలో ఆదివారం ఉదయం పేలుడు సంభవించడంతో 9 మంది మృతి చెందారు. క్యాస్ట్ బూస్టర్ ప్లాంట్ ప్యాక్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. By srinivas 17 Dec 2023 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. బజార్ గాన్ లోని ఒక సోలార్ కంపెనీలో ఆదివారం ఉదయం పేలుడు సంభవించడంతో 9 మంది మృతి చెందారు. క్యాస్ట్ బూస్టర్ ప్లాంట్ ప్యాక్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఇది కూడా చదవండి : శ్రీనివాస్ గౌడ్ తమ్ముడికి బిగ్ షాక్ .. తొమ్మిది కేసులు నమోదు ఇక సమాచారం అందుకున్న వెంటనే ఘటన స్థలానికి చేరకున్న నాగ్ పూర్ ఎస్పీ హర్ష్ పొద్దార్ సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్‌లో ఈరోజు ఉదయం దాదాపు 9.30 గంటలకు ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. కొందరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను దగ్గరలోని ఆస్పత్రికి తరలించాం. ఫైర్ ఇంజన్లు మంటలు ఆర్పుతున్నాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్నాం. ఇంకా లోపల ఎవరైనా ఉన్నారా? ఎంతమంది చనిపోయారనేది ఇప్పుడే చెప్పలేమని ఎస్పీ తెలిపారు. ఇక ఈ కంపెనీ దేశ రక్షణ విభాగానికి సంబంధించిన పేలుడు పదార్థాలు, ఇతర రక్షణ పరికరాల సరఫరాను అందించడంలో కీలకంగా వ్యవహరిస్తుందని అధికారులు తెలిపారు. #maharashtra #9-people-died #explosion-solar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి