Sleeping Tips: ఈ చిన్న ట్రిక్ పాటించండి.. రాత్రిపూట హ్యాపీగా నిద్రపోండి!

ఆరోగ్యంగా జీవించాలంటే నిద్ర కీలకం. మంచి నిద్ర మొత్తం శ్రేయస్సును మెరుగుపరుస్తుంది, మనిషి జీవితకాలాన్ని పెంచుతుంది. అయితే ప్రస్తుతం సమ్మర్ సీజన్ కొనసాగుతోంది. వేసవిలో రాత్రిపూట సరిగా నిద్ర పట్టాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలని నిపుణులు చెబుతున్నారు.అవేంటంటే!

Sleeping Tips: ఈ చిన్న ట్రిక్ పాటించండి.. రాత్రిపూట హ్యాపీగా నిద్రపోండి!
New Update

సాధారణంగా వేసవిలో పగటి సమయం ఎక్కువగా ఉంటుంది. అందుకే ప్రజలు త్వరగా మేల్కొంటారని పరిశోధనల్లో తేలింది. ఎండాకాలంలో వాతావరణం వేడిగా ఉంటుంది. నైట్ టెంపరేచర్స్ కూడా భారీగా పెరుగుతాయి. ఇది నిద్రకు భంగం కలిగిస్తుంది. వేసవిలో పగటి సమయం ఎక్కువగా ఉండటంతో నిద్రకు కీలకమైన మెలటోనిన్ హార్మోన్ తక్కువ విడుదల అవుతుంది. జీవనశైలి అంశాలు కూడా నిద్రలేమికి కారణమవుతున్నాయి. జంక్ ఫుడ్ తినడం, వేళకు తినకపోవడం, మద్యపానం, ధూమపానం వంటి చెడు అలవాట్లు నిద్రపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. అయితే వేసవిలో రాత్రిపూట సరిగా నిద్ర పట్టాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..

వేసవి కాలంలో నిద్ర బాగా పట్టాలంటే, ఫిక్స్‌డ్ స్లీపింగ్ అవర్స్‌తో ఒక షెడ్యూల్‌ ఏర్పర్చుకోవాలి. ప్రతిరోజూ ఒకే సమయంలో పడుకోవడం, మేల్కోవడం అలవాటు చేసుకోవాలి. పగటి సమయాల్లో ఎండల్లో ఎక్కువగా తిరగడం తగ్గించాలి. సాయంత్రం సమయాల్లో ఇంట్లోనే ఉండటం మంచిది. దీంతో మంచి నిద్ర కోసం శరీరం సిద్ధమవుతుంది.

ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉంటే, నిద్రను పేరేపిస్తుంది. అందరి ఇళ్లలో ఏసీలు ఉండవు. అందుకే బెడ్‌రూమ్‌లో సీలింగ్ ఫ్యాన్‌కు కింద ఫ్లోర్ మీద ఒక బకెట్ ఉంచి అందులో చల్లని నీరు పోయాలి. ఐస్ ముక్కలు కూడా ఉంచుకోవచ్చు. ఇది ఫ్యాన్ గాలిని కూల్ చేస్తుంది. దీంతో గది ఉష్ణోగ్రత తగ్గి, నిద్ర బాగా పడుతుంది.ఇంట్లోకి గాలి, వెలుతురు బాగా ప్రసరించేలా ఏర్పాట్లు చేసుకోవాలి. వెంటిలేషన్ సరిగా ఉంటే, గది లోపలి వాతావరణం బాగుంటుంది. వేసవిలో తేలికైన కాటన్ దుస్తులు ధరించాలి. ఇవి చెమటను బాగా పీల్చుకుంటాయి, చికాకును తగ్గిస్తాయి. దీంతో ప్రశాంతంగా నిద్ర పడుతుంది.

పడుకోవడానికి ముందు స్నానం చేయడం మంచిది. దీంతో శరీర ఉష్ణోగ్రత తగ్గి నిద్రను ప్రేరేపిస్తుంది. ఒత్తిడిగా ఉండే యాక్టివిటీస్, సాయంత్రం సమయాల్లో హెవీ వర్కౌట్స్, రాత్రి అతిగా తినడం వంటివి చేయకూడదు. ఇవి శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి. దీంతో రాత్రి నిద్రకు భంగం కలగవచ్చు.బీర్, విస్కీ, ఇతర ఆల్కహాలిక్ డ్రింక్స్ ఏవైనా నిద్రపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. అందులోని రసాయనాలు నిద్రకు భంగం కలిగిస్తాయి. అందుకే రాత్రి పడుకునే ముందు ఆల్కహాల్ తాగకూడదు. శరీరాన్ని శాంతపరచడానికి దీర్ఘ శ్వాస, ధ్యానం వంటి రిలాక్సింగ్ వ్యాయామాలు చేయాలి. ఇవి ఒత్తిడిని తగ్గిస్తాయి, నిద్ర నాణ్యతను పెంచుతాయి.

#sleeping-tips #summer
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe