Exit Polls vs Bettings: ఎగ్జిట్ పోల్స్ లీక్స్.. రివర్స్ అవుతున్న బెట్టింగ్స్..

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మరికొద్ది గంటల్లో విడుదల కాబోతున్నాయి. ఈలోపు ఆ ఫలితాల లీక్స్ చక్కర్లు కొడుతున్నాయి. దీంతో బెట్టింగ్ రాయుళ్లు తమ అంచనాలను మార్చుకుంటున్నారు. ఈ క్రమంలో కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నట్టు తెలుస్తోంది. 

Exit Polls vs Bettings: ఎగ్జిట్ పోల్స్ లీక్స్.. రివర్స్ అవుతున్న బెట్టింగ్స్..
New Update

Exit Polls vs Bettings: రోజుకో వార్త.. పూటకో కబురు.. విజేతలు ఎవరు అనే చర్చలు.. గెలుపు మాదంటే మాదంటున్న ప్రధాన ప్రత్యర్ధులు.. ప్రజల్లో నరాలు తెగే ఉత్కంఠ.. ఇదీ తెలుగురాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నెలకొన్న పరిస్థితి. ఎన్నికలు జరిగి పదిహేను రోజలు దాటిపోయింది. ఇంకా ఫలితాల వెల్లడికి మూడు రోజుల సమయం ఉంది. కానీ, ఈలోపు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఫలితాలపై తీవ్రమైన ఆసక్తితో ప్రజలు ఎదురు చూస్తున్నారు. సాధారణ ప్రజలు దైనందిన జీవితాలతో సతమతమవుతూనే.. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే అంచనాలు వేసుకోవడం.. చర్చల్లో మునిగిపోవడం జరుగుతోంది. మరోవైపు పోటీ చేసిన అభ్యర్థులు తమ గెలుపు పై పైకి ధీమా వ్యక్తం చేస్తున్నా.. సైలెంట్ ఓటు ఎవరిని కిల్ చేస్తుందో అనే టెన్షన్ లో ఉన్నారు. ఓటు వేసిన వారిది ఒకరకం ఆసక్తి.. పోటీ చేసినవారిది మరోరకం టెన్షన్. ఈ రెండూ కాకుండా మరో వర్గం ఒకటి ఉంది. అదే బెట్టింగ్ రాయుళ్లు. అవును. ఏపీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి మీరు ఆర్టికల్ చదువుతున్న ఈ క్షణం వరకూ కూడా ఏపీలో గెలుపు ఎవరిది అంటూ పందేలు జోరుగా సాగుతున్నాయి. 

ట్రైలర్ రాబోతోంది.. 

Exit Polls vs Bettings: ఎన్నికల ఫలితాలకు ట్రైలర్స్ ఈరోజు (జూన్ 1) సాయంత్రం రాబోతోంది. సాధారణంగా సినిమాలకు ట్రైలర్స్ మేకింగ్ కంపెనీ విడుదల చేస్తుంది. కానీ, ఈ ఎన్నికల చిత్రానికి మాత్రం సర్వే సంస్థలు.. మీడియా సంస్థలు ట్రైలర్స్ రిలీజ్ చేయబోతున్నాయి. ఆ ట్రైలర్స్ టైటిల్ ఎగ్జిట్ పోల్స్.. ట్రైలర్ కంటే ముందు టీజర్ రిలీజ్ అయినట్టు.. డైరెక్ట్ గా కాకపోయినా, లీక్ ల రూపంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు పందేల రాయుళ్లకు ముందుగా చేరిపోయాయి. దీంతో ఇప్పుడు ఎన్నికల పందేలలో కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. 

రకరకాల అంచనాలు.. 

Exit Polls vs Bettings: ఏపీలో ఎన్నికల ఫలితాలపై పందేల జోరు ఎలా ఉందంటే.. కోట్లాది రూపాయలు ఇప్పటికే చేతులు మారాయి. ఎన్నికలు పూర్తి అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకూ జరిగిన పందాలు ఒక లెక్క అయితే.. ఎగ్జిట్ పోల్స్ కొద్ది గంటల్లో విడుదల అవుతాయనగా జరుగుతున్న పందాలు ఒక లెక్కగా మారాయి. ఎగ్జిట్ పోల్స్ లీక్స్ వచ్చిన తరువాత పందాల తీరు మారిపోయిందని చెబుతున్నారు. లీక్స్ ప్రకారం అంచనాలు చాలా మారిపోయాయట. దీంతో పందాలు కాసిన వారు తమ పందాలను మళ్ళీ మార్చుకుంటున్నారు లేదా కొత్తగా మారిన ట్రెండ్ కు అనుగుణంగా మరో పందెం వేస్తున్నారని చెబుతున్నారు. 

Also Read: హార్థిక్ ఆశలపై నీళ్లు చల్లుతున్న శ్రేయస్ ఆయ్యర్!

ఏమి జరుగుతోంది?

Exit Polls vs Bettings: పందాల మార్పులు విచిత్రంగా జరుగుతున్నాయని అంటున్నారు. ఉదాహరణకు కచ్చితంగా గెలుస్తారు అనుకున్న ఒక నాయకుడికి అనుకూలంగా గతంలో ఆయన మెజార్టీ లెక్కల పై పందాలు కాసారు. ఇప్పుడు అంచనాల ప్రకారం ఆ నాయకుడికి మెజార్టీ తగ్గవచ్చని తెలుస్తోంది. దీంతో మెజార్టీ లెక్కలపై పందాలు వేసిన వారు ఇప్పుడు తమ పందాలను వెనక్కి తీసుకోవడం లేదా మరో విధంగా పందెంలోకి మార్చడం చేస్తున్నారు. ఇక ఇక్కడ అధికార పార్టీ కచ్చితంగా బంపర్ మెజార్టీ కొడుతోంది అనే అంచనాలు వేసిన ఒక వర్గం ఆదిశలో గట్టిగా పందాలు కాసింది. కానీ, ఇప్పుడు అందుతున్న లీక్స్ ప్రకారం సీట్ల సంఖ్యలో చాలా తేడా కొట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దీంతో ఆమేరకు పందాలు మారిపోతున్నాయట. ఇప్పుడు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ లీక్స్ కూడా ఏపీలో ప్రభుత్వంపై క్లియర్ పిక్చర్ ఇవ్వడం లేదని అంటున్నారు. ముఖ్యంగా చివరి రెండు గంటల్లో జరిగిన ఓటింగ్ విషయంలో పెద్ద పెద్ద సంస్థలు కూడా తలలు పెట్టుకున్నాయని తెలుస్తోంది. ఎందుకంటే.. ఆ రెండుగంటలు ఏమి జరిగింది అనేది ఎవరి అంచనాలకు అందడం లేదు. ఈ నేపథ్యంలో పందాల రాయుళ్లు కూడా తమ పందాలను అటూ ఇటూ మార్చుతూ వస్తున్నారని చెబుతున్నారు. 

తెలంగాణ లోనూ అదే పరిస్థితి.. 

Exit Polls vs Bettings: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో పోటీ ప్రధానంగా అధికార కాంగ్రెస్.. బీజేపీ మధ్యనే ఉంటుందని ఎన్నికల ముందు వరకూ అంచనాలు వెలువడ్డాయి. బీఆర్ఎస్ మహా అయితే ఒక్క సీటు గెలుస్తుంది అని చెప్పుకొచ్చాయి సర్వేలు. కానీ, ఎన్నికలు జరిగిన తరువాత ఈ లెక్కలు మారిపోయినట్టు లీకయిన ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నాయి. దీంతో బీఆర్ఎస్ వైపు పందాలు ఇప్పుడు ఎక్కువగా జరుగుతున్నాయి. అంతకు ముందు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పందాలు వేసిన వారు కూడా ఇప్పుడు తమ పందాలను మార్చుకుంటున్నారని చెబుతున్నారు. 

కొద్ది గంటల్లో..

Exit Polls vs Bettings: ఇంకొద్ది గంటల్లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చేస్తాయి. ఇవి పూర్తిగా నిజం అవుతాయని చెప్పలేం. కానీ, కొంత వరకూ ట్రెండ్ ని తెలియచేస్తాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాల తరువాత మరింత వేగంగా పందాల ట్రెండ్స్ మారతాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే, సంక్రాతి కోడి పందాలు మహా అయితే ఒక మూడు రోజులు జోరుగా సాగుతాయి. కానీ, ఈసారి ఎన్నికల పందాలు మాత్రం రోజుల తరబడి కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కోట్లాది రూపాయలు చేతులు మారిపోతున్నాయి. కోడి పందాలకు ఒక బరి ఉంటుంది.. అక్కడ కాస్తయినా నిరోధించే అవకాశం ఉంటుంది. కానీ, ఈ ఎన్నికల పందాలు కంటికి కనిపించకుండా జరిగిపోతాయి. వేలాది మందిని వీధిన పడేస్తాయి. ఏది ఏమైనా ఎగ్జిట్ పోల్స్ ఫలితాల నేపథ్యంలో పందాలు కూడా మారిపోతుండడం చెప్పుకోదగ్గ విషయం

#exit-polls #2024-elections
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe