IPL 2024 : ఐపీఎల్ తాజా సీజన్ లో ప్లే ఆఫ్ అవకాశాలు మెరుగుపడాలంటే ప్రతి మ్యాచ్ గెలవాల్సిన స్థితిలో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) జట్టు బ్యాటింగ్ లో అదరగొట్టింది. ఇవాళ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం(Arun Jaitley Stadium) లో రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్… నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 221 పరుగులు చేసింది.
ఓపెనర్లు జేక్ ఫ్రేజర్ మెక్ గుర్క్, అభిషేక్ పోరెల్ అర్ధసెంచరీలతో అదరగొట్టగా… ఆఖర్లో ట్రిస్టాన్ స్టబ్స్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మెక్ గుర్క్, పోరెల్ జోడీ తొలి వికెట్ కు 60 పరుగులు జోడించి శుభారంభం అందించింది. మెక్ గుర్క్ 20 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సులతో 50 పరుగులు చేయగా, పోరెల్ 36 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సులతో 65 పరుగులు చేశాడు.
పూర్తిగా చదవండి..