నా చిరకాల వాంఛ నెరవేరింది.... రామ్ లల్లా దర్శనంపై తలైవా వ్యాఖ్యలు....!

సూపర్ స్టార్ రజనీ కాంత్ అయోధ్య(ayodhya)లో రాముల వారిని దర్శించుకున్నారు. అయోధ్య దర్శనంతో తన చిరకాల వాంఛ నెరవేరిందన్నారు. ఆయోధ్య దర్శనం అత్యద్బుతమన్నారు. రాష్ట్రంలో పలువురు ప్రముఖులో సమావేశం కావడం చాలా సంతోషంగా అనిపించిందని పేర్కొన్నారు. దేవుని అనుగ్రహం వుంటే ఆలయ నిర్మాణం వుంటే మళ్లీ అయోధ్యకు వస్తానన్నారు.

author-image
By G Ramu
New Update
నా చిరకాల వాంఛ నెరవేరింది.... రామ్ లల్లా దర్శనంపై తలైవా వ్యాఖ్యలు....!

‘జైలర్’(jailer) మూవీ సక్సెస్ తో సూపర్ స్టార్ రజనీకాంత్(Rajani kanth) మంచి జోష్ లో వున్నారు. తాజాగా ఆయన అయోధ్య(ayodhya)లో రాముల వారిని దర్శించుకున్నారు. అయోధ్య దర్శనంతో తన చిరకాల వాంఛ నెరవేరిందన్నారు. ఆయోధ్య దర్శనం అత్యద్బుతమన్నారు. రాష్ట్రంలో పలువురు ప్రముఖులో సమావేశం కావడం చాలా సంతోషంగా అనిపించిందని పేర్కొన్నారు.

రజనీకాంత్ ఆదివారం అయోధ్యకు చేరుకున్నారు. ఆయనకు రామ జన్మభూమి వద్ద ఆలయ సీనియర్ అధికారులు, అయోధ్య కమిషనర్ గౌరవ్ దయాల్, ఐజీ ప్రవీణ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ విశాల్ సింగ్ ఘనంగా స్వాగతం పలికారు. తలైవాకు అయోధ్య రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ రామ ఆలయ నమూనాను అందజేశారు.

రామ్ లల్లా ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రామ మందిర నిర్మాణ పనులు సాగుతున్న తీరును ఆయన పరిశీలించారు. ఆ తర్వాత హనుమాన్ గర్హి ఆలయానికి వెళ్లారు. అక్కడ హనుమంతునికి సూపర్ స్టార్ ప్రత్యేక పూజలు చేశారు. అయోధ్య ఆలయానికి రావాలని తాను చాలా కాలంగా అనుకుంటున్నట్టు చెప్పారు.

తాజాగా రామ్ లల్లా దర్శన భాగ్యం తనకు కలిగిందన్నారు. దేవుడు అనుగ్రహిస్తే తాను ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత ఇక్కడకు మళ్లీ వస్తానన్నారు. హనుమాన్ గర్హి ఆలయంలో రజనీ కాంత్ పది నిమిషాల పాటు వున్నారని ఆలయ ప్రధాన మహంత్ రాజు దాస్ తెలిపారు. సూపర్ స్టార్ కు ధన్య వాదాలు తెలిపినట్టు వెల్లడించారు. సూపర్ స్టార్ అయోధ్యకు రావడం సంతోషంగా వుందన్నారు.

అంతకు ముందు ఆయన రాజధాని లక్నోలో పర్యటించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా పలువురు ప్రముఖులను ఆయన కలిశారు. మొదట రాజ్ భవన్ లో రాష్ట్ర గవర్నర్ ఆనంది బెన్ పటేల్ లో రజనీ సమావేశం అయ్యారు. అనంతరం సీఎం యోగీ ఆదిత్యనాథ్ తో భేటీ అయ్యారు. యోగీ పాదాలకు రజనీ నమస్కారం చేయడంపై పెద్ద ఎత్తున్న ట్రోలింగ్ నడిచింది.

Advertisment
తాజా కథనాలు