Yarlagadda meets Chandrababu Naidu: చంద్రబాబును కలిసిన యార్లగడ్డ వెంకట్రావు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో గన్నవరం సీనియర్ నేత యార్లగడ్డ వెంకట్రావు కాసేపట్లో భేటీ కానున్నారు. దీంతో వీరి భేటీపై ప్రాధాన్యత సంతరించుకుంది. చంద్రబాబుతో భేటీ కోసం ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు యార్లగడ్డ వెంకట్రావు. ఈ నెల 22వ తేదీన గన్నవరంలో యార్లగడ్డ పసుపు కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది.

Yarlagadda meets Chandrababu Naidu: చంద్రబాబును కలిసిన యార్లగడ్డ వెంకట్రావు
New Update

EX YCP Leader Yarlagadda will meet Chandrababu Naidu Today at Hyderabad: తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును యార్లగడ్డ వెంకట్రావు ఆదివారం ఉదయం ఆయన నివాసంలో కలిశారు. ఇరువురూ కొద్దిసేపు చర్చలు జరిపారు. ఈ నెల 22న గన్నవరం సభలో యార్లగడ్డ వెంకట్రావు తెలుగు దేశం పార్టీ కండువా కప్పుకోనున్నారు. అనంతరం యార్లగడ్డ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. డబ్బు సంపాదించాలని తాను రాజకీయాల్లోకి రాలేదన్నారు. ఆరేళ్లుగా వైసీపీకి సేవ చేశానని, మూడున్నర ఏళ్లుగా వైసీపీలో ఎన్నో చూశానన్నారు యార్లగడ్డ.

రాజకీయాల కోసమే అమెరికా వదిలి ఇక్కడకు వచ్చానన్నారు. తన వర్గానికి చెందిన వారికి పదవులు ఇవ్వనప్పుడు మదన పడ్డానన్నారు. పార్టీ ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడే చేస్తానని, గుడివాలో చేయమన్నా చేస్తానని స్పష్టం చేశారు. వైసీపీలో ఉన్నప్పుడు అనేక అంశాలను ప్రస్తావించానని, హైదరాబాద్‌ మహానగరం అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు పాత్ర ఉందని యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. వైసీపీలో మన ఇష్టా ఇష్టాలతో సంబంధం లేదన్నారు. తనకు వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి అంటే చాలా ఇష్టమని.. అయితే సజ్జలనే తనపై ఆరోపణలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు యార్లగడ్డ వెంకట్రావు.

కాగా ఈ నెల 18వ తేదీన వైసీపీకి గుడ్ బై చెప్పారు గన్నవరం కీలక నేత యార్లగడ్డ వెంకట్రావు. ఈ మేరకు మీడియా సమావేశం నిర్వహించి అధికారికంగా యార్లగడ్డ ప్రకటన చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను అవమానాలను ఎదుర్కోవడానికే రాజకీయాల్లోకి వచ్చినట్లయిందని మీడియా ముందు వాపోయారు. వైసీపీలో ఉండగా ఒక్కసారి కూడా ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడిని కలవలేదన్నారు. కలిశానని ముఖ్యమంత్రి నమ్మితే అది ఇంటిలిజెన్స్ వైఫల్యమేనని యార్లగడ్డ పేర్కొన్నారు.

ఇప్పుడు బహిరంగంగా చెబుతున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అపాయింట్ మెంట్ తీసుకుని తెలుగుదేశం పార్టీలో చేరతానని యార్లగడ్డ తేల్చి చెప్పారు. తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తే గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో నేను గన్నవరం నియోజకవర్గంలో నుండి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో నీకు ఎదురు పడతానని సీఎం జగన్ కి సవాల్ విసిరారు యార్లగడ్డ వెంకట్రావు.

సీఎం జగన్ ను టిక్కెట్ ఇవ్వాలని మాత్రమే అడిగానని తెలిపారు. పార్టీ పెద్దలకు ఏం అర్థమైందో ఏమో తనకు తెలియలేదని చెప్పారు. తనను ఎక్కడైనా పార్టీ సర్దుబాటు చేస్తుందని సజ్జల ప్రకటన చేస్తే బాగుండేదని అన్నారు యార్లగడ్డ. కానీ పార్టీలో ఉంటే ఉండు.. పోతే పొమ్మని సజ్జల చెప్పడంతో తనకు చాలా బాధ, ఆవేదన కలిగాయని అన్నారు. టీడీపీ కంచుకోటలో తాను ఢీ అంటే ఢీ అని పోరాడానని గుర్తు చేశారు. ఆ బలమే ఇప్పుడు బలహీనత అయిందా? అని ప్రశ్నించారు. టీడీపీలో గెలిచిన అభ్యర్థిని తెచ్చుకోవడం మీకు బలంగా మారిందా అని నిలదీశారు యార్లగడ్డ.

తడి గుడ్డతో గొంతు కోయడం అనేది తన విషయంలో నిజమైందని ఆవేదన వ్యక్తం చేశారు. నమ్మిన మనిషిని కాపాడాల్సిన బాధ్యత ఏ పార్టీకైనా ఉంటుందని అన్నారు. తాను ఇంతవరకు చంద్రబాబు, లోకేష్, ఇతర టీడీపీ నేతలను కలవలేదని చెప్పారు. తాను టీడీపీ నేతలను కలిసినట్లు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానని ఛాలెంజ్ చేశారు. ఇప్పుడు చంద్రబాబును కలవబోతున్నానని ప్రకటించారు యార్లగడ్డ వెంకట్రావు.

#chandrababu-naidu #hyderabad #tdp-chief-chandrababu #today #ex-ycp-leader-yarlagadda-venkatrao #ex-ycp-leader-yarlagadda
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe