AP: జోగి రమేష్ ఒక దొంగ.. మాజీ ఎమ్మెల్సీ రామ్మోహన్ సెన్సేషనల్ కామెంట్స్..!

జోగి రమేష్ మంత్రిగా ఉన్నపుడు 2600 మంది బీసీలపై తప్పుడు కేసులు పెట్టారని మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ ఆరోపించారు. బీసీ కాబట్టే తనపై ఈ అక్రమ కేసులు పెడుతున్నారని ఇప్పుడు జోగి రమేష్ అంటుండడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జోగి ఒక దొంగ అంటూ ధ్వజమెత్తారు.

New Update
AP: జోగి రమేష్ ఒక దొంగ.. మాజీ ఎమ్మెల్సీ రామ్మోహన్ సెన్సేషనల్ కామెంట్స్..!

West Godavari: టీడీపీ మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. మాజీ మంత్రి జోగి రమేష్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయన ఒక దొంగ అంటూ ఆరోపించారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని జోగి రమేష్ చేసిన అవినీతి అంత ఇంతా కాదన్నారు. ఈ దొంగ రమేష్ అగ్రిగోల్డ్ భూములు కూడా వదల్లేదు అంటూ ఆయన ధ్వజమెత్తారు.

Also Read: నీకో లక్ష.. బిడ్డకో లక్ష.. ప్రియురాలిని వంచించి.. పెళ్లికి నో చెప్పిన ప్రియుడు..!

తండ్రి, కొడుకులు చెప్తున్న మాటలు చాలా విడ్డూరంగా ఉన్నాయని.. బీసీ కాబట్టే తనపై ఈ అక్రమ కేసులు పెడుతున్నారని జోగి రమేష్ అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బీసీ కులం కార్డు ఇప్పుడు గుర్తుకు వచ్చిందా? అంటూ జోగి రమేష్ ను మాజీ ఎమ్మెల్సీ రామ్మోహన్ ప్రశ్నించారు.

Also Read: దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో మరో ట్విస్ట్‌.. వివాదంలోకి మరో కొత్త వ్యక్తి ఎంట్రీ!

జోగి రమేష్.. మంత్రిగా ఉన్నపుడు 2600 మంది బీసీలపై తప్పుడు కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.పెడనలో ఆక్వా చెరువుకు ఒక ట్రాన్స్ఫర్మర్ వేయాలంటే రూ.50 వేలు వసూలు చేశారని.. ఒక ఎకరం చెరువు తవ్వలంటే రూ. 40 వేలు వసూలు చేశారని ఆరోపించారు.  బీసీల్లో ఇలాంటి వ్యక్తి ఉన్నందుకు అందరు ఛీ కొడుతున్నారని మండిపడ్డారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు