National : జమిలి ఎన్నికలపై రాష్ట్రపతికి రామ్‌నాథ్ కోవింద్ కమిటీ నివేదిక జమిలి ఎన్నికలపై రాష్ట్రపతికి రామ్‌నాథ్ కోవింద్ కమిటీ నివేదిక సమర్పించింది. మొత్తం 18వేల పేజీలతో నివేదిక సమర్పించారు. ఇందులో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా..రాజ్యాంగంలోని చివరి 5 ఆర్టికల్స్‌ను సవరించాలని సిఫారసు చేశారు. By Manogna alamuru 14 Mar 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి One Nation, One Election : ఒకే దేశం ఒకే ఎన్నికలు పేరి దేశంలో అన్నిరకాల ఎన్నికల(Elections) ను ఒకేసారి నిర్వహించాలనే ప్రతిపాదన మీద మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ...ఈరోజు నివేదికను రాష్ట్రప్రతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) కు సమర్పించింది. ఈరోజు దయం రాష్ట్రపతి భవన్(Rashtrapati Bhavan)కు వెళ్ళి జమిలి ఎన్నికల(Jamili Elections) మీద 18,629 పేజీల నివేదికను అందజేశారు. ఇందులో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా..రాజ్యాంగంలోని చివరి 5 ఆర్టికల్స్‌ను సవరించాలని సిఫారసు చేశారు. లోక్‌సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఒకే ఓటర్ల జాబితాపై దృష్టి పెట్టాలి అని నివేదికలో సూచించారు. ఒకేసారి ఎన్నికలతో ఆర్థికంగా ఎంతో లాభం ఉంటుందని..లోక్ సభ, అసెంబ్లీల ఎన్నికలు ఒకేసారి, మిగిలిన స్థానిక సంస్థల ఎన్నికలు మరోసారి నిర్వహిస్తే సముచితంగా ఉంటుందని కోవింద్ కమిటీ చెబుతోంది. 190 రోజుల పరిశీలన... దాదాపు 190 రోజుల పాటూ రామ్‌సాథ్ కోవింద్(Ram Nath Kovind) కమిటీ జమిలీ ఎన్నికల అంశం మీద అధ్యయనం చేసింది. పలు రంగాల నిపుణలతో విస్తృత సమావేశాలు నిర్హించారు దేశంలో ఉన్న ప్రజల నుంచి కూడా సలహాలు, సూచనలు స్వీకరించారు. లోక్‌సభ, శాశనసభ , స్థానిక ఎన్నికలు ఏకకాలంలో జరగాలంటే రాజ్యాంగంలో కనీసం 5 ఆర్టికల్స్‌ను సవరించాలని రామనాథ్ కోవిండ్ కమిటీ తెలిపింది. గత కొంత కాలంగా జమిలీ ఎన్నికల మీద బలంగా ప్రచారం చేస్తున్న బీజేపీ సర్కారు 2023 సెప్టెంబర్‌లో ఈ విషయం మీద కమిటీని వేసింది. రామ్‌నాథ్ కోఇంద్ నేతృత్వంలో కేంద్రమంత్రి అమిత్ షా, అధిర్ రంజన్ చౌదరి, గులాం నబీ ఆజాద్, 15వ ఆర్ధిక సంఘం మాజీ ఛైర్మన్ ఎన్‌కే సింగ్, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కశ్యప్, సీనియర్ లాయర్ హరీశ్ సాల్వే, మాజీ ఛీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారీలు ఇందులోని సభ్యులు. లా కమీషన్ కూడా.. ఇక మరోవైను జమిలీ ఎన్నికల మీద లా కమీషన్ కూడా తమ నివేదికను సిద్ధం చేసింది. ఈ ఎన్నికల కోసం రాజ్యాంగంలో ప్రత్యేకంగా ఒక అధ్యయనాన్ని చేర్చాలని లా కమీషన్ చెప్పనుంది. దీని ప్రకారం 2029 నాటికి ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేలా ప్లాన్ చేయొచ్చని లా కమీషన్ అభిప్రాయపడుతోంది. #droupadi-murmu #president #ram-nath-kovind మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్‌లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి