Jamili Election: జమిలీ ఎన్నికల సాధ్యాసాధ్యాలపై తొలిసారి భేటి అయిన కోవింద్ కమిటీ
ఒకే దేశం- ఒకే ఎన్నిక(వన్ నేషన్-వన్ ఎలక్షన్) కొన్ని రోజులుగా వినపడుతున్న పదం. దేశవ్యాప్తంగా పార్లమెంట్‌తో అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ప్రధాని మోదీ ప్రభుత్వం ఎప్పటినుంచో భావిస్తోంది. ఇందుకోసం సాధ్యాసాధ్యాలపై చర్చించేందుకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీని కూడా ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే.