EX MLA Shakeel : మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు కేసులో కీలక పరిణామం

మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహెల్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సోహెల్‌ను ఈ కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు చేసిన బోధన్ ఇన్‌స్పెక్టర్ ప్రేమ్ కుమార్, షకీల్ అనుచరుడు అబ్దుల్ వాసేను అదుపులోకి తీసుకున్నారు పంజాగుట్ట పోలీసులు. సోహెల్ ప్రస్తుతం దుబాయిలో ఉన్నాడు.

New Update
Ex MLA Shakeel: అలా చేస్తే నా కొడుకుని ఉరితీయండి.. మాజీ ఎమ్మెల్యే షకీల్ సంచలన వ్యాఖ్యలు

BRS EX MLA Shakeel : మాజీ ఎమ్మెల్యే షకీల్(Ex MLA Shakeel) కుమారుడి ర్యాష్ డ్రైవింగ్ కేసు(Rash Driving Case) లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పంజాగుట్ట పోలీసులు(Punjagutta Police). అతన్ని ఈ కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు చేసిన బోధన్ ఇన్‌స్పెక్టర్ ప్రేమ్ కుమార్, షకీల్ అనుచరుడు అబ్దుల్ వాసేను ఈ రోజు ఉదయం బోధన్‌(Bodhan) లో అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తీసుకొచ్చారు పోలీసులు. ఇటీవల మితిమీరిన వేగంతో కారు నడిపి ప్రజాభవన్‌ ఎదుట ట్రాఫిక్‌ బారికేడ్లను ఢీ కొట్టాడు షకీల్ కుమారుడు సోహెల్. ఈ కేసును తప్పించుకునేందుకు అతని స్థానంలో డ్రైవర్‌ను పెట్టి దుబాయ్ పారిపోయాడు సాహిల్‌.

ALSO READ: సొంత జిల్లాలో కేటీఆర్‌కు బిగ్ షాక్

మాజీ ఎమ్మెల్యే షకీల్ మీద కేసు...

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కు పోలీసులు షాక్ ఇచ్చారు. తన కొడుకు సోహెల్ ను కేసు నుంచి తప్పించేందుకు విదేశాలకు పంపించిన బోధన్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పై కేసు నమోదు చేశారు . దీనికి సహకరించిన పంజాగుట్ట మాజీ సీఐ దుర్గారావుపై కూడా కేసు నమోదు చేశారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహెల్ ఇటీవల తన BMW కారును వేగంతో నడిపి ప్రజా భవన్ ఎదురుగా ఉన్న ట్రాఫిక్ బారికేడ్లను ఢీ కొట్టిన విషయం తెలిసిందే. 

అసలు ఏమైందంటే.. ప్రజాభవన్ వద్ద డిసెంబర్ 24న (ఆదివారం) రాత్రి అతివేగంగా వచ్చిన ఓ బీఎండబ్ల్యూ కారు(BMW Car) భారీకేడ్లను ఢీ కొట్టింది. ఆ సమయంలో కారులో ఇద్దరు యువకులతో పాటు ఇద్దరు యువతులు ఉన్నట్లు తెలిసింది. ఆ కారు బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహెల్ దని చెబుతున్నారు పోలీసులు. వీళ్లంతా స్టూడెంట్స్ అని.. కారు డ్రైవ్ చేసింది బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహెల్ అని కన్ఫామ్ చేశారు పోలీస్ అధికారులు. ప్రస్తుతం సోహెల్ పరారీలో ఉండగా.. అతడి కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. మిగతా యువకులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

యాక్సిడెంట్ జరిగిన తర్వాత షకీల్‌ ఇంట్లో డ్రైవర్‌గా పని వేసే వ్యక్తి.. తానే డ్రైవ్ చేసినట్లుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చాడని వెల్లడించారు. షకీల్ డ్రైవర్ పోలీసుల్ని తప్పుదోవ పట్టించే యత్నం చేశాడని.. కానీ సీసీ ఫుటేజీ ద్వారా సోహెల్‌ కారు నడిపినట్లు గుర్తించినట్లు చెప్పారు. మద్యం మత్తులో బారికేడ్లను ఢీకొట్టారని చెబుతున్నారు. సోహెల్‌పై గతంలోనూ జూబ్లీహిల్స్‌లో ఓ యాక్సిడెంట్‌ కేసు నమోదు అయింది.

Also Read : మోదీ సర్కార్ కీలక ప్రకటన…లబ్దిదారులకు రూ. 5లక్షలు. వెంటనే ఈ విధంగా చేయండి..!!

DO WATCH: 

Advertisment
Advertisment
తాజా కథనాలు