సీఎం కేసీఆర్ (CM KCR) కామారెడ్డిలో పోటీ చేస్తున్నానంటూ ప్రకటించిన నాటి నుంచి రాష్ట్ర రాజకీయాల్లో ఆ సీటు హాట్ టాపిక్ గా మారింది. కేసీఆర్ కు పోటీగా ఇతర పార్టీల నుంచి ఎవరు బరిలోకి దిగుతారు? అన్న అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ లిస్ట్ లో కామారెడ్డి అభ్యర్థిని ప్రకటించలేదు. దీంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీ ఇక్కడి నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. దీంతో గతంలో ఇక్కడి నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి షబ్బీర్ అలీ (Shabbir Ali) ఈ సారి బరిలో ఉండరన్న చర్చ సాగింది. ఈ నేపథ్యంలో ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టారు షబ్బీర్ అలీ.
ఇది కూడా చదవండి: Telangana Elections 2023: కోమటిరెడ్డి మీద బూర నర్సయ్య పోటీ?
ఈ ఎన్నికల్లో కూడా తాను పోటీ కామారెడ్డి నుంచే పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. తాను పుట్టింది ఈ గడ్డమీదనే అని అన్నారు. కామారెడ్డి ప్రజలు ఎమ్మెల్యే చేసిన కారణంగానే తనకు ఈ గుర్తింపు వచ్చిందన్నారు. చిన్న వయస్సులోనే తనకు మంత్రి పదవిని కాంగ్రెస్ పార్టీ కల్పించిందన్నారు. తనకు మరో అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు.
ఇది కూడా చదవండి: Maoist Letter: టార్గెట్ పొంగులేటి, పువ్వాడ.. ఎన్నికల వేళ మావోయిస్టుల సంచలన లేఖ!
వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2009లో మలక్ పేట లేదా శేరిలింగంపల్లి నుంచి పోటీ చేయాలని సూచించినా.. తాను కామారెడ్డి నుంచే పోటీ చేశానని గుర్తు చేశారు. కేసీఆర్ కామారెడ్డికి పొలిటికల్ టూరిస్టూ అంటూ అభివర్ణించారు. ఈ సారి తనకు అవకాశం ఇవ్వాలని కామారెడ్డి ప్రజలను కోరారు. ఈ ఎన్నికల్లో తాను తప్పకుండా విజయం సాధిస్తానన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. తాను నియోజకవర్గం మారున్నానన్న ప్రచారం.. బీఆర్ఎస్ పనేనంటూ ఫైర్ అయ్యారు.