బారికేడ్లు తోసి... బీఆర్​ఎస్​కు వార్నింగ్

సీఎం కేసీఆర్ ప్రభుత్వంపై మాజీ కేంద్రమంత్రి రేణుక చౌదరి సీరియస్ అయ్యారు. అండబలం, కండబలం, అధికార బలంతో మమ్మల్ని ఏమీ చేయలేరు అంటూ వార్నింగ్ ఇచ్చింది. మా ఎమ్మెల్యేలను బీఆర్ఎస్‌ తీసుకుందన్నారు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే.. చేరికల తర్వాత ఇంకా చాలా ఉంటాయని రేణుక చౌదరి అన్నారు.

New Update
బారికేడ్లు తోసి... బీఆర్​ఎస్​కు వార్నింగ్

Push barricades... warning to BRS

ఖమ్మంలో కాంగ్రెస్​ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జన గర్జన సభకు బీఆర్​ఎస్​ అడ్డంకులు సృష్టించడంపైన మాజీ కేంద్ర మంత్రి రేణుక చౌదరి సీరియస్​ అయ్యారు. కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ సభకు అడుగడుగునా ఆంక్షలు విధించడమేంటని బీఆర్​ఎస్​ సర్కార్​ను ప్రశ్నించారు. 4 నెలల్లో రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వం వస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.అనంతరం ఖమ్మం రూరల్​మండలం కరుణ గిరి వద్ద వాహనాలు అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన బారికేడ్లను ఆగ్రహంతో తన్ని చేతితో పక్కకు తొలగించారు. బారికేడ్లు ఏర్పాటు చేసి సభను అడ్డుకోలేరని అన్నారు. మంత్రి పువ్వాడ అజయ్​ దోచుకుని దాచుకునే రకమని విమర్శించారు. కార్యక్రమంలో ముస్తఫా, రామకృష్ణ తదితరులు ఉన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు