Jagadish Reddy: కాంగ్రెస్, బీజేపీ కలిసి నాటకాలు ఆడుతున్నాయి: మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి

TG: ప్రభుత్వానికి నీళ్లు ఇచ్చే ఉద్దేశం లేదని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి. కాంగ్రెస్, బీజేపీ నేతలు కలిసి కాళేశ్వరంపై నాటకాలు ఆడారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై తప్పుడు ప్రచారాలు చేశారని అన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్ట్స్ నీళ్లులేక ఎండిపోతున్నాయన్నారు.

New Update
Jagadish Reddy: కాంగ్రెస్, బీజేపీ కలిసి నాటకాలు ఆడుతున్నాయి: మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి

Jagadish Reddy: ఒక్క మంత్రికి వ్యవసాయంపై అవగాహన లేదని అన్నారు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి. క్రిష్ణా, గోదావరి నదులు ఆంధ్రా కోసమే పుట్టినట్లు గతంలో పాలకులు వ్యవహరించారని ఫైర్ అయ్యారు. నీళ్లు ఎలా లిఫ్ట్ చేయాలో తెలిసి కేసీఆర్ కన్నెపల్లి పంప్ హౌస్‌ను నిర్మించారని అన్నారు. విహార యాత్రలు చేయడం కాంగ్రెస్ నేతలకు అలవాటు అని మండిపడ్డారు. నేడు రామగుండం దగ్గర గోదావరి ఎలా ఉంది? అని ప్రశ్నించారు.

మేడిగడ్డకు ఏదో జరిగిందని ప్రభుత్వం చెప్తుందని అన్నారు. మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్, సింగూరు ప్రాజెక్టులు నీళ్లు లేక ఎండిపోతున్నాయని చెప్పారు. కోదాడ, సూర్యాపేట నియోజకవర్గాల్లో రైతులు నీళ్ల కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. మేడిగడ్డ దగ్గర 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృధాగా పోతున్నాయని.. ప్రభుత్వానికి నీళ్లు ఇచ్చే ఉద్దేశం లేదు అని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి కాళేశ్వరంపై నాటకాలు ఆడారని విమర్శించారు. ఎన్డీఎస్‌ఏ హైదరాబాద్ రాకుండా ఢిల్లీ నుంచే కిషన్ రెడ్డి చెప్పినట్లు రిపోర్ట్ ఇచ్చిందని చెప్పారు.

Advertisment
తాజా కథనాలు