Ambati Rambabu: సీఎంల భేటీపై మాజీ మంత్రి అంబటి రాంబాబు మూడు ప్రశ్నలు

AP: రెండు రాష్ట్రాల సీఎంలు సమావేశం కావడంపై ట్విట్టర్ (X) వేదికగా మూడు ప్రశ్నలు వేశారు అంబటి రాంబాబు. ఏపీలో కలిపిన 7 మండలాలను తెలంగాణ ప్రభుత్వం తిరిగి అడిగిందా?, వివిధ పోర్టుల్లో వాటా అడిగిందా?, టీటీడీ ఆదాయంలో వాటా అడిగిందా? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని అన్నారు.

Ambati Rambabu: సీఎంల భేటీపై మాజీ మంత్రి అంబటి రాంబాబు మూడు ప్రశ్నలు
New Update

Ambati Rambabu: రెండు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు సమావేశం కావడంపై ట్విట్టర్ (X) వేదికగా స్పందించారు వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీపై మంత్రుల ప్రెస్మీట్ అనంతరం ఆయన ట్వీట్ చేశారు. ఏపీలో కలిపిన 7 మండలాలను తెలంగాణ ప్రభుత్వం తిరిగి అడిగిందా? అని ప్రశ్నించారు. 'ఏపీకి ఉన్న సుదీర్ఘమైన తీర ప్రాంతంలో, వివిధ పోర్టుల్లో తెలంగాణ వాటా అడిగిందా? టీటీడీ ఆదాయంలోనూ, బోర్డులోనూ వాటా అడిగిందా? ఈ ప్రశ్నలకు ఇరు రాష్ట్రాల ప్రతినిధులు స్పష్టత ఇవ్వకపోవడం సమంజసమా?' అని ఆయన ప్రశ్నల బాణం వేశారు. కాగా నిన్న విభజన సమస్యలపై రెండు రాష్ట్రాల సీఎంలు ప్రజాభవన్ లో సమావేశమైన సంగతి తెలిసిందే. దాదాపు ఈ సమేవేశం రెండు గంటల పాటు సాగింది.

రెండు రాష్ట్రాల్లో రెండు కమిటీలు..

పదేళ్లుగా చాలా అంశాలు పరిష్కరానికి నోచుకోలేదని, వాటిని పరిష్కరించేందుకు ఉన్నతస్థాయి అధికారులతో కమీటీలు వేయాలని నిర్ణయించినట్లు భట్టి తెలిపారు. ఇక డ్రగ్స్‌, సైబర్‌ నేరాల కట్టడికి రెండు తెలుగు రాష్ట్రాలు సంయుక్తంగా కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించామని భట్టి విక్రమార్క వెల్లడించారు. ప్రధానంగా రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ చట్టం షెడ్యూలు 9, 10లో పేర్కొన్న సంస్థల ఆస్తుల పంపకాలపై చర్చ జరిగింది.

అలాగే విభజన చట్టంలో పేర్కొనని సంస్థల ఆస్తుల పంపకాలు, ఆంధ్రప్రదేశ్‌ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌ అంశాలు, పెండింగ్‌ విద్యుత్తు బిల్లులు, విదేశీ రుణ సాయంతో ఉమ్మడి రాష్ట్రంలో 15 ప్రాజెక్టులు నిర్మించిన అప్పుల పంపకాలు, ఉమ్మడి సంస్థలకు చేసిన ఖర్చుకు చెల్లింపులు, హైదరాబాద్‌లో ఉన్న మూడు భవనాలు ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించే అంశంతోపాటు లేబర్‌ సెస్‌ పంపకాలు ఉద్యోగుల విభజన అంశాలపై సమావేశంలో చర్చించినట్లు సమాచారం

#ambati-rambabu
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe