Balakrishna: బినామీల పేరుతో 214 ఎకరాలు.. కస్టడీలో కీలక వివరాలు

హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తులు మరిన్ని బయటపడ్డాయి. 8రోజుల కస్టడీ విచారణలో బినామీల పేరిట మొత్తం 214 ఎకరాల వ్యవసాయ భూములు, 29 ఓపెన్ ప్లాట్లు, 8 ఫ్లాట్లు, ఒక విల్లా ఉన్నట్లు బహిర్గతమైంది.

New Update
Balakrishna: బినామీల పేరుతో 214 ఎకరాలు.. కస్టడీలో కీలక వివరాలు

Illegal assets: హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తులు ఒక్కోక్కటిగా బయటపడుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన కేసులో అరెస్ట్ అయిన శివబాలకృష్ణ కస్టడీ బుధవారం ముగిసింది. దీంతో న్యాయస్థానం ఆదేశాలతో ఏసీబీ అధికారులు అతడిని తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించారు.

బినామీల పేరిట 214 ఎకరాలు..
ఈ క్రమంలోనే 8రోజుల్లో ఏసీబీ అధికారులు వివిధ కోణాల్లో బాలకృష్ణను విచారించడంతో సంచలన విషాయలు బయటపడ్డాయి. అక్రమంగా సంపాదించిన సొమ్మును ఎక్కువగా స్థిరాస్తుల కొనుగోళ్లకే వెచ్చించినట్లు వెల్లడించారు. అంతేకాదు శివబాలకృష్ణతోపాటు కుటుంబసభ్యులు, బినామీల పేరిట మొత్తం 214 ఎకరాల వ్యవసాయ భూములు, 29 ఓపెన్ ప్లాట్లు, 8 ఫ్లాట్లు, ఒక విల్లా ఉన్నట్లు దర్యాప్తులో బహిర్గతమైంది.

ఆస్తుల విలువ రూ.250 కోట్లు..
ఈ మేరకు రెరా కార్యదర్శిగా పనిచేసినప్పుడు భారీగా సంపాదించిన ఆయన ఇప్పటి వరకు బయటపడిన ఆస్తుల విలువ రూ.250 కోట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆస్తులను భార్య, కూతురు, అల్లుడు, సోదరుడి పేరిట రిజిస్ట్రేషన్ చేయించినట్లు గుర్తించారు. శివబాలకృష్ణ సోదరుడు శివ నవీన్‌ పేరిట కూడా 70 శాతం ఆస్తులలున్నాయని, తెలంగాణతో పాటు ఏపీలో కూడా భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు చెప్పారు.

ఇది కూడా చదవండి : Vijayawada: జనసేనలో గ్రూప్ వార్.. టికెట్ కోసం కుస్తీ

ఒకేచోట 102 ఎకరాల వ్యవసాయ భూమి..
అత్యధికంగా జనగాంలోనే ఆస్తులు ఒకేచోట 102 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా..యాదాద్రి భువనగిరిలో 66 ఎకరాలు, నాగర్ కర్నూల్ లో 38 ఎకరాలున్నట్లు పేర్కొన్నారు. ఇక రంగారెడ్డిలో 12, మెదక్ లో 2, మేడ్చల్ లో 2, సంగారెడ్డిలో 3 ప్లాట్లు, సిద్ధిపేటలో 7 ఎకరాల భూమి సంపాదించినట్లు బయటపెట్టారు. అయితే హైదరాబాద్ తర్వాత వరంగల్ పై గత ప్రభుత్వం ఫోకస్ పెట్టిన విషయాన్ని గమనించిన బాలకృష్ణ తన ఆస్తులను వరంగల్ హైవే పక్కనే కొనుగోలు చేసినట్లు తెలిపారు. యాదాద్రి, జనగాంలో భారీగా వ్యవసాయ భూముల కొనుగోలు చేశాడని, అందంతా బినామీల పేరిట ఉందని దర్యాప్తులో తేలింది. ఇక మరోవైపు మూడు రోజులపాటు హెచ్‌ఎండీఏ ప్రధాన కార్యాలయంలో తనిఖీలు చేసి స్వాధీనం చేసుకున్న దస్త్రాల్ని ఏసీబీ క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. పలు స్థిరాస్తి సంస్థలకు శివబాలకృష్ణ మంజూరు చేసిన అనుమతులపై ఆరా తీస్తోంది.

15 బ్యాంకుల్లో ఖాతాలు..
అలాగే అతని కుటుంబసభ్యుల పేరిట మొత్తం 15 బ్యాంకు ఖాతాలున్నట్లు ఏసీబీ గుర్తించింది. ఆయా ఖాతాల పేరిట ఉన్న లాకర్లను తెరిచేందుకు ప్రయత్నించింది. శివబాలకృష్ణ పేరిట ఉన్న ఒక్క లాకర్‌ను తెరవగా.. ఒక పట్టాదారు పాస్‌పుస్తకంతోపాటు 18 తులాల బంగారం లభ్యమైంది. వాటికి లెక్కలు చూపించకపోవడంతో అధికారులు వాటిని జప్తు చేశారు. అతడి అక్రమాలపై ఏసీబీకి ప్రస్తుతం నాలుగు ఫిర్యాదులు అందాయని, వాటిని పరిశీలిస్తున్నట్లు ఏసీబీ జాయింట్‌ డైరెక్టర్‌ సుధీంద్ర చెప్పారు.

Advertisment
తాజా కథనాలు