Telangana: కమర్షియల్‌ ట్యాక్స్‌ స్కామ్‌.. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం

కమర్షియల్ ట్యాక్స్ కేసును తెలంగాణ ప్రభుత్వం సీఐడీకి బదిలీ చేసింది. మాజీ సీఎస్‌ సోమేష్‌కుమార్‌ను A-5గా చేర్చడంతో ఆయన్ని అరెస్టు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో మొత్తం రూ.1400 కోట్ల స్కామ్ జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.

New Update
Telangana: కమర్షియల్‌ ట్యాక్స్‌ స్కామ్‌.. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం

కమర్షియల్ ట్యాక్స్ కేసులో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసును సీఐడీకి బదిలీ చేసింది. త్వరలోనే ఈ స్కామ్‌లో త్వరలో అరెస్ట్‌లు జరగనున్నాయి. మాజీ సీఎస్‌ సోమేష్‌కుమార్‌ను A-5గా చేర్చడంతో ఆయన్ని అరెస్టు చేస్తారని చర్చ నడుస్తోంది. మొత్తం రూ.1400 కోట్ల స్కామ్ జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) పోలీసులు ఐదుగురిపై FIR నమోదు చేశారు. ఈ స్కామ్‌కు సంబంధించి సోమేష్‌పై పోలీసులు ఆధారాలు సేకరించారు. కొందరు పన్ను ఎగ్గొట్టేందుకు అప్పట్లో అధికారులు సహకరించినట్లు ఆరోపణలు వచ్చాయి. 75 మంది పన్ను చెల్లింపుదారుల వివరాలను నిందితులు ఉద్దేశపూర్వకంగా ఆన్‌లైన్‌లో కనిపించకుండా చేశారు.

Also Read: సినీ నిర్మాతల మండలి సంచలన నిర్ణయం.. ఆ నటీనటులపై చర్యలకు సిద్ధం!

కమర్షియల్ ట్యాక్స్‌, ఐఐటీ హైదరాబాద్‌ మధ్య జరిగిన లావాదేవీలను సైతం పక్కదారి పట్టించినట్లు గుర్తించారు. హైదరాబాద్‌ ఐఐటీ సాఫ్ట్‌వేర్‌లోని సమాచారాన్ని స్పెషల్ ఇనిషియేటివ్ వాట్సప్ గ్రూప్‌కు చేరేలా సోమేష్‌ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఆ గ్రూప్‌లో మాజీ సీఎస్‌ సోమేష్‌ కీలకంగా ఉన్నట్లు గుర్తించారు. తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్‌ పన్ను ఎగవేత ద్వారా ప్రభుత్వానికి రూ.1000 కోట్ల నష్టం వాటిల్లింది. మరో 11 ప్రయివేటు సంస్థలు కూడా రూ.400 కోట్ల వరకు పన్ను ఎగవేశాయి. ఈ కేసులో మరికొంతమందికి సీసీఎస్‌ పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు.

Also Read: ఈ ఏడాదిలో రూ.185 లక్షల కోట్లకు దేశ అప్పు: కేంద్రం

Advertisment
తాజా కథనాలు