Majhi Oath Ceremony : ఒడిశా (Odisha) మాజీ సీఎం నవీన్ పట్నాయక్ (Naveen Patnayak). ఈయన గురించి తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఐదుసార్లు ఒడిశా ముఖ్యమంత్రిగా చేసిన ఘనత ఈయనది. ఈసారి కూడా నవీన్ ట్నాయకే సీఎం అవుతారని అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తు ఈసారి ఒడిశాను బీజేపీ (BJP) కైవసం చేసుకుంది. దాంతో కొత్త ముఖ్యమంత్రిగా ఆ పార్టీ నేత అయిన మాఝీ (Majhi) ప్రమాణ స్వీకారం చేశారు. దీనికి మాజీ సీఎం నవీన్ పట్నాయక్ కూడా హాజరయ్యారు. అంతేకాదు మొత్తం వేడుకలో ఎంతో హుందాగా ప్రవర్తించారు కూడా. కొత్త సీఎంకు మనఃస్పూర్తిగా అభినందనలు తెలపడమే కాక...ప్రధాని మోదీ, ఇతర బీజేపీ నేతలతో సైతం నవ్వుతూ మాట్లాడారు. ఇలాంటివి జరగడం చాలా అరుదుగా కనిపిస్తుంటుంది. కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి పాత సీఎంలు వచ్చిన దాఖలాలు ఇంతకు ముందు పెద్దగా లేదు. దీంతో ఇప్పుడు నవీన్ పట్నాయక్ వార్తల్లో వ్యక్తి అయిపోయారు. ఎన్నికల్లో ఓడిపోయినా అందరి మనసులనూ గెలుచుకున్నారు అంటున్నారు. నవీన్ ట్నాయక్‌ను ప్రతీ నేతా ఆదర్శంగా తీసుకోవాలని చెబుతున్నారు.
ఇక మాఝీ ప్రమాణ స్వీకారంలో మరో దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. వీరందరితో పాటూ మాజీ సీఎం నవీన్ ట్నాయక్ కూడా పాల్గొన్నారు. ఈసమయంలో పీఎం మోదీ, నవీన్ ట్నాయక్‌తో కరచాలనం చేశారు. ఆ తర్వాత ఆయనతో కాసేపు ముచ్చటించారు కూడా. ఇది కూడా ఈ మొత్తం కార్యక్రమానికి హైలెట్‌గా నిలిచింది.
ఇక ఒడిశాకు మొదటి బీజేపీ సీఎంగా మాఝీ రికార్డుల్లోకి ఎక్కారు. గతంలో గిరిజన సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ నేత హేమానంద బిస్వాల్, గిరిధర్ గమాంగ్‌లు ఒడిశా సీఎంలుగా వ్యవహరించారు. వారి తర్వాత ఇప్పుడు మాఝి సీఎం అయ్యారు. ఈయనతో పాటూ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన ప్రవతి పరీదా కూడా తొలి మహిళా ఉపముఖ్యమంత్రిగా రికార్డ్ సృష్టించారు.