KCR: మాజీ సీఎం కేసీఆర్ కు హైకోర్టులో ఊరట.. ఆ పిటిషన్ కొట్టివేత!

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై 2019లో దాఖలైన ఈపీని హైకోర్టు కొట్టేవేసింది. గజ్వేల్ నుంచి 2018లో కేసీఆర్ ఎన్నిక కావాడాన్ని సవాల్ చేస్తూ దాఖలపై ఎలక్షన్ పిటిషన్ పై విచారణ కొనసాగించాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంది.

New Update
Mallareddy: మల్లారెడ్డికి కేసీఆర్ బిగ్ షాక్!

మాజీ సీఎం,బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు హైకోర్టులో ఊరట లభించింది. కేసీఆర్ పై 2019లో దాఖలైన ఎలక్షన్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. గజ్వేల్ నుంచి 2018లో కేసీఆర్ ఎన్నిక కావడాన్ని సవాల్ చేస్తూ దాఖలపై ఎన్నికల పిటిషన్ పై విచారణ కొనసాగించాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంది. కాగా కేసీఆర్ ఎన్నికను రద్దు చేయాలని 2019లో సిద్ధిపేట జిల్లా మామిడ్యాలకు చెందిన టి. శ్రీనివాస్ పిటిషన్ దాఖలు చేశారు. 2018లో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ సమర్పించిన అఫిడవిట్ లో పలు వాస్తవాలను వివరించకుండా గోప్యంగా ఉంచారంటూ పిటిషనర్ ఆరోపించారు.

కేసీఆర్ పై 64 కేసులు నమోదు కాగా.. కేవలం 2 కేసుల గురించి మాత్రమే అఫిడవిట్‌లో పేర్కొన్నారన్నారు.ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి 2018లో జరిగిన ఎన్నికల కాలపరిమితి గడువు ముగిసిన కారణంగా ఎన్నికల పిటిషన్ పై విచారణ కొనసాగింపు అవసరం లేదని వెలువరించిన తీర్పులో స్పష్టం చేశారు. 2018 ఎన్నికల కాలపరిమితి ముగిసిందని.. దీనిపై ఎలాంటి ఉత్తర్వులు జారీ చేసినా ఫలితం ఉండదని పిటిషన్‌ను కొట్టివేస్తూ జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

అటు చంద్రబాబు ఇంట్లో మూడు రోజుల పాటు ప్రత్యేక యాగాలు..అధికారమే లక్ష్యమా?

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా ఉండవల్లి కరకట్టపై ఉన్న తన నివాసంలో నేటి నుంచి మూడు రోజుల పాటు యాగాలు నిర్వహించనున్నారు. యాగాలు, పూజలు నిర్వహిస్తారు. ఇందులో శతచండీ, పారాయణ , మహాచండీ యాగం, సుదర్శన నారసింహ హోమాలు ఉన్నాయి. చంద్రబాబు, భవనేశ్వరి దంపతులు ఈయాగంలో పాల్గొంటున్నారు. ఇందులో భారీ ఏర్పాట్లు చేశారు. యాగాలు, పూజల నేపథ్యంలో చంద్రబాబు ఈ మూడు రోజుల పాటు తన అపాయింట్ మెంట్ల ను మొత్తం రద్దు చేసుకున్నారు. 

తన 4 శతాబ్దాల రాజకీయ జీవితంలో తొలిసారిగా జైలుకు వెళ్లి వచ్చిన చంద్రబాబు బెయిల్ బయటకు వచ్చాక వరుసగా దైవదర్శనాలతో బిజీగా ఉంటున్నారు. ఇందులో తిరుమల శ్రీవారిని, బెజవాడ దుర్గమ్మను, గుణదల మేరీమాత ఆలయాలను ఇప్పటికే దర్శించుకున్నారు చంద్రబాబు. అలాగే తమిళనాడులోని అక్కడి దేవాలయాలను దర్శించుకున్నారు. ఇప్పుడు తన ఇంట్లోనే ప్రత్యేక యాగాలు, పూజలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.

ఇక రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి అధికారం చేపట్టాలన్న లక్ష్యంతో చంద్రబాబు పనిచేస్తున్నారు. ఇప్పటికే పవన్ కల్యాణ్ జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. బీజేపీ కలిసి రాకపోయినా కమ్యూనిస్టులు, కాంగ్రెస్ తో కలిసి ఎన్నికలకు వెళ్లేందుకు చంద్రబాబు ఏర్పాట్లు చేస్తున్నారు. తన అరెస్టు తర్వాత రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులు కలిపి వస్తాయని చంద్రబాబు ధీమాగా ఉన్నారు. త్వరలో అమరావతిలో భారీ సభ పెట్టి టిడిపి జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో కూడా ప్రకటించేందుకు రెడీ అవుతున్నారు.

ఇది కూడా చదవండి:  తెలంగాణలో మళ్లీ కరోనా కల్లోలం.. హైదరాబాద్ లో 14 నెలల చిన్నారికి ఆక్సిజన్.

Advertisment
తాజా కథనాలు