Jagan: నేడు వైసీపీ ఎంపీలతో జగన్ కీలక భేటీ AP: మాజీ సీఎం జగన్ అధ్యక్షతన వైసీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ కానుంది. ఈ సమావేశానికి లోక్ సభ, రాజ్యసభ ఎంపీలు హాజరుకానున్నారు. పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహాలు, బుధవారం ఢిల్లీలో చేపట్టే దీక్షపై జగన్ వారితో చర్చించనున్నారు. By V.J Reddy 20 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి Jagan: ఇవాళ వైసీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ కానుంది. ఉదయం 10:30 గంటలకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మాజీ సీఎం జగన్ అద్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి వైసీపీ లోక్ సభ, రాజ్యసభ ఎంపీలు హాజరుకానున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు దిశా నిర్దేశం చేయనున్నారు జగన్. ఢిల్లీలో బుధవారం చేయనున్న దీక్ష పైన ఎంపీలు, పార్టీ నేతలతో చర్చించనున్నారు. కాగా నిన్న వినుకొండలో హత్యకు గురైన వైసీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించారు జగన్. వారికి వైసీపీ అండగా ఉంటుందని ధీమా ఇచ్చారు. ఈ ఘటనకు నిరసనగా ఢిల్లీలో బుధవారం దీక్ష చేయనున్నట్లు జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే, ఈరోజు టీడీపీ కూడా... ఇవాళ టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది. మధ్యాహ్నం 2:30 కు ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో ఈ భేటీ కానుంది. భేటీకి రాష్ట్ర మంత్రులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి నిధులు తీసుకురావడంపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే శాఖల వారీగా మంత్రులను ఎంపీలకు అటాచ్ చేసింది ప్రభుత్వం. ఆయా శాఖల వారీగా కేంద్రం నుంచి తీసుకురావలసిన నిధులపై ఎంపీలతో మంత్రులు సమన్వయం చేసుకోనున్నారు. అలాగే పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం చంద్రబాబు ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. Also Read : ఇవేం చెత్త ప్రశ్నలు.. పాక్ జర్నలిస్టుపై హర్భజన్ ఫైర్! #jagan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి