Jagan: నేడు పులివెందులకు మాజీ సీఎం జగన్

AP: ఎన్నికల్లో వైసీపీ ఓటమి తరువాత తొలిసారి సాధారణ ఎమ్మెల్యేగా పులివెందులకు వెళ్లనున్నారు మాజీ సీఎం జగన్. ఈ నేపథ్యంలో జగన్ ఇంటి వద్ద భద్రత ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు పోలీసులు.

New Update
Jagan: నేడు వైసీపీ ఎంపీలతో జగన్ కీలక భేటీ

YCP Chief Jagan: ఎన్నికల్లో వైసీపీ ఓటమి తరువాత తొలిసారి సాధారణ ఎమ్మెల్యేగా పులివెందులకు వెళ్లనున్నారు మాజీ సీఎం జగన్. పులివెందులలోని భాకరాపురంలోని నివాసంలో బస చేయనున్నారు. విజయవాడ నుంచి మధ్యాహ్నం సమయంలో కడప చేరుకోనున్నారు. కడప నుంచి రోడ్డు మార్గాన పులివెందులకు వెళ్లనున్నారు. గతంలో సీఎంగా పనిచేసినప్పుడు ఎటువంటి భద్రత కల్పించారో అదే భద్రత కొనసాగిస్తున్నారు అధికారులు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద ఇప్పటికే భద్రత ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు పోలీసులు.

కూల్చివేతలపై జగన్ సీరియస్..

తాడేపల్లిలో ఈరోజు తెల్లవారుజామున వైసీపీ కార్యాలయాన్ని సీఆర్‌డీఏ అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై తాజాగా మాజీ సీఎం, వైసీపీ చీఫ్ జగన్ ఎక్స్ వేదికగా స్పందిచారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరోస్థాయికి తీసుకెళ్లారు. ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తికావొచ్చిన వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారు. హైకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేశారు. 

Advertisment
తాజా కథనాలు