/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/JAGAN-jpg.webp)
EX CM Jagan: ఎన్నికల ఓటమిపై మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల ఇంఛార్జులను మార్చే ఆలోచనలో జగన్ ఉన్నట్లు పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇందుకోసం జగన్ పార్టీలోకి కీలక నేతల సమావేశాలు నిర్వహించినట్లు సమాచారం. పెనమలూరు నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి జోగి రమేష్ ను సొంత సెగ్మెంట్ మైలవరానికి మార్చినట్లు తెలుస్తోంది. కమ్మ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ దేవభక్తుని చక్రవర్తిని పెనమలూరు ఇంఛార్జిగా నియమించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మిగిలిన నియోజకవర్గాల్లోనూ మార్పులపై కసరత్తు జరుగుతోందని తెలిపాయి.