Gone Prakash: ఏపీ , తెలంగాణ రాష్ట్రాల్లో రావణాసురుడు, శిశుపాలుడి పాలన పోయిందని మాజీ ఆర్టీసీ చైర్మన్ గోనె ప్రకాశ్ రావు అన్నారు. ఏపీ సచివాలయంలో ఈ రోజు సీఎం చంద్రబాబును (CM Chandrababu Naidu) ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రకాశ్ రావు మాట్లాడుతూ.. ప్రజాదర్భార్ లు నిర్వహించి మంత్రి లోకేష్ (Nara Lokesh), సీఎం చంద్రబాబు ప్రజలకు మంచి చేస్తున్నారని కొనియాడారు. గత ప్రభుత్వం అసలు ప్రజల సమస్యల గురించి పట్టించుకోలేదని మండిపడ్డారు. బంధువులే తనకు తెలియదంటూ సీబీఐ కోర్టుకు అబద్దాలు చెప్పిన దుర్మార్గుడు జగన్ (YS Jagan) అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో ప్రైవేటు భూమి అయినా కొనుగోలు చేసి ఏపీ మంచి అతిథిగృహం నిర్మించాలని సూచించారు. జన్మభూమి లాంటి కార్యక్రమాలను చంద్రబాబు చేపడితే విదేశీ విరాళాలు ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 36 హత్యలు జరిగాయని చెబుతున్న జగన్ వాటి వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేసిన జగన్ కు సిగ్గు ఉందా? అని ప్రశ్నించారు. ప్రజల నుంచి పూర్తి మెజారిటీ వచ్చాక రాష్ట్రపతి పాలన ఎలా అనుమతిస్తారని వ్యాఖ్యానించారు. దేశంలోని ఏ ముఖ్యమంత్రి కూడా జగన్ లా పరదాలు కట్టుకుని పర్యటించలేదన్నారు.
Also Read: ఎమ్మెల్సీగా గెలుపు నాదే.. బొత్స సంచలన కామెంట్స్