Modi's Speech : మోదీ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ...ఎర్రకోట వేదికగా ప్రధాని ఏం చెప్పబోతున్నారు..? స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఢిల్లీలోని ఎర్రకోట ముస్తాబు అవుతుంది. ఆగస్టు 15 ఉదయం 9 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన మోదీ సర్కార్ కు ఈ ఆగస్టు 15 చాలా కీలకమైనది. ఎర్రకోట వేదికగా మోదీ చేయబోయే కీలక ప్రసంగంపై దేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. By Bhoomi 13 Aug 2023 in నేషనల్ New Update షేర్ చేయండి స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఢిల్లీలోని ఎర్రకోట ముస్తాబు అవుతుంది. ఆగస్టు 15 ఉదయం 9 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన మోదీ సర్కార్ కు ఈ ఆగస్టు 15 చాలా కీలకమైనది. ఎర్రకోట వేదికగా మోదీ చేయబోయే కీలక ప్రసంగంపై దేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అతి త్వరలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మోదీ తమపై దయ చూపిస్తారేమోనని పేద, మధ్యతరగతి ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మోదీ ప్రసంగంపై ఇప్పటికి పీఎంఓ అధికారులు తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. మోదీ ప్రసంగంలో ఏముంటుంది? ఎర్రకోట వేదికగా ప్రధాని మోదీ ఏం చెప్పబోతున్నారు? అనేది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఈసారి వినూత్నంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. దేశ రాజధాని ఢిల్లీలోని ఉన్న వివిధ రాష్ట్రాల భవనలకు ఒక సర్కులర్ జారీ చేసింది. ప్రతి రాష్ట్రము వారి సంస్కృతి సంప్రదాయాలను ఉట్టిపడే వస్త్రాలు ధరించి వేడుకలకు హాజరుకావాలని సర్కులర్ జారీ చేసింది. ఒక్కొక్క రాష్ట్రం నుంచి 20 మంది జంటలను పంపించాలని కోరింది. అలాగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగే ఎర్రకోటకు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. కాగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 76 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, ఈ ఏడాది ఆగస్టు 13 నుండి 15 వరకు ప్రతి ఇంటి వద్ద త్రివర్ణ పతాకాల ఉద్యమంలో పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశ ప్రజలను కోరారు. భారత జెండా స్వాతంత్ర్య స్ఫూర్తికి, జాతీయ ఐక్యతకు ప్రతీక అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎర్రకోట, రాజ్‌ఘాట్‌తో పాటు రాజధానిలోని ప్రతి మూలను ఢిల్లీ పోలీసులు నిఘా ఉంచారు. ఈ క్రమంలో ఢిల్లీ పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లతో పెట్రోలింగ్, వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు. మరోవైపు, ఎర్రకోటలో వివిధ సాయుధ బలగాల పూర్తి డ్రెస్ రిహార్సల్ జరుగుతోంది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 76 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, ఈ ఏడాది ఆగస్టు 13 నుండి 15 వరకు 'హర్ ఘర్ తిరంగ' ఉద్యమంలో పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశ ప్రజలను కోరారు. భారత జెండా స్వేచ్ఛ, జాతీయ ఐక్యతకు ప్రతీక అని ప్రధాని మోదీ అన్నారు. త్రివర్ణ పతాకంతో కూడిన సెల్పీలను 'హర్ ఘర్ తిరంగా' వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని ప్రజలను కోరారు .ఆగస్ట్ 15 అంటే స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఎర్రకోటలో జరిగే జెండా ఎగురవేత కార్యక్రమానికి దేశం నలుమూలల నుండి దాదాపు 1800 మంది ప్రత్యేక అతిథులు హాజరవుతారు . భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి ఈ ఏడాది 76 ఏళ్లు పూర్తవుతున్న వేళ, ఉధృతమైన గ్రామాల సర్పంచ్‌లు, ఉపాధ్యాయులు, నర్సులు, రైతులు, మత్స్యకారులు, ఢిల్లీలో సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించిన శ్రమ యోగులు, ఖాదీ రంగ కార్మికులు, జాతీయ అవార్డు పొందిన పాఠశాల ఉపాధ్యాయులు, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, యూనియన్ దేశంలోని వివిధ ప్రాంతాల్లో అమలవుతున్న అమృత్ సరోవర్ ప్రాజెక్టులు, హర్‌ఘర్ జల్ యోజన ప్రాజెక్టుల్లో సహాయం చేసిన, పనిచేసిన వారిని, వారి జీవిత భాగస్వాములతో సహా ఈ ఏడాది ఢిల్లీలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరు కావాలని వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆహ్వానించింది. మహారాష్ట్రకు చెందిన 'ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన' (పిఎం-కిసాన్) లబ్ధిదారులు ఎర్రకోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను చూడనున్నారు. PM మోదీ ప్రసంగాన్ని వినడానికి ఆహ్వానించిన సుమారు 1800 మంది వ్యక్తులలో యాభై (50) మంది లబ్ధిదారులు, వారి కుటుంబాలతో సహా తిలకించనున్నారు. Your browser does not support the video tag. #independence-day #redfort #modi-speech మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి