Sai Pallavi : డబ్బెవడికి కావాలి.. అంటున్న సాయిపల్లవి.. మరో సౌత్ సినిమాకు నో!

సాయిపల్లవి.. పరిచయం అక్కర్లేని పేరు. సౌత్ హీరోయిన్లలో తన రూటే సపరేటు. తనకు నచ్చితేనే సినిమా చేస్తుంది. లేకపోతే ఎంత డబ్బు ఇస్తామన్నా నో అని కచ్చితంగా చెప్పేస్తుంది. ప్రస్తుతం తండేల్ తో బిజీగా ఉన్న ఆమెకు తాజాగా ఒక భారీ ఆఫర్ వచ్చింది. ఆమె ఒప్పుకోలేదని చెబుతున్నారు

New Update
Sai Pallavi : డబ్బెవడికి కావాలి.. అంటున్న సాయిపల్లవి.. మరో సౌత్ సినిమాకు నో!

South Heroines : సౌత్ హీరోయిన్స్ అందరిదీ ఒక లెక్క.. సాయిపల్లవి ఒక్కరిదీ మరోలెక్క. సెలెక్టెడ్ సినిమాలు.. ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్.. మలయాళంలో ఒక రేంజ్ లో అభిమానులను సంపాదించుకుని.. తెలుగులో ప్రేక్షకులను ఫిదా చేసేసింది ఈ భామ. సాయిపల్లవి సినిమాలో ఉంది అంటే.. సమ్ థింగ్ స్పెషల్(Something Special) అనేలా తెలుగులో డీసెంట్ ప్లేస్ పట్టేసింది. సాయిపల్లవి(Sai Pallavi) సినిమాలో కనిపించినా సంచలనమే.. కనిపించకపోయినా సంచలనమే. సినిమా హీరోయిన్ అంటే.. అదీ ఇదీ అని చెప్పే నటీమణుల మధ్యలో.. తనదంటూ ప్రత్యేకత నిలబెట్టుకున్న సాయిపల్లవి క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. 

Sai Pallavi

సినిమా లో హీరోయిన్ పాత్ర అంటే.. సాయిపల్లవి(Sai Pallavi) ప్రాధాన్యతలు వేరు. ఆమె అనుకున్న ప్రాధాన్యతల మేరకే సినిమా ఒప్పుకుంటుంది. కెరీర్ మొదటి నుంచి ఆమె ఎంచుకున్న పాత్రలు.. వదిలేసిన పాత్రలు.. చూస్తే తెలిసిపోతుంది సాయిపల్లవి అంటే ఏమిటో. తన ప్రాధాన్యత ఎలా ఉంటుందో. ఎట్టి పరిస్థితిలోనూ తన ప్రాధాన్యతలను మార్చుకోదు ఆమె. చాలామంది హీరోయిన్లు ఇండస్ట్రీకి వచ్చి.. ఒక్క హిట్ వస్తే చాలు.. అమాంతం తమ రెమ్యునరేషన్ పెంచేసి.. ఎలాంటి సినిమాకైనా ఎస్ చెప్పేసి.. సంవత్సరానికి నాలుగైదు సినిమాల్లో కనిపించేసి.. తరువాత ప్రేక్షకులకు గుర్తులేకుండా పోవడం చూస్తుంటాం. కానీ.. సాయిపల్లవి(Sai Pallavi) ఆ టైప్ కాదు. ఒక సినిమాలో ఆమె చేసింది అంటే.. ఆ సినిమా హిట్.. ఫట్ తో సంబంధం లేకుండా.. చాలాకాలం పాటు సాయిపల్లవి పాత్ర.. అందులో ఆమె నటన ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి. అందుకే సాయి పల్లవి అంటే అంత క్రేజ్. 

Sai Pallavi

Also Read: గోదావరికి బై చెప్పిన విశ్వక్.. న్యూ లుక్కుతో ట్వీట్..

ఇదంతా ఎందుకంటే.. సాయిపల్లవి(Sai Pallavi) ఒక సినిమా ఒప్పుకోవాలంటే తన ప్రాధాన్యతల మేరకే కథ.. అందులోని తన పాత్ర ఉండాలి. అలా లేకపోతే.. ఎంత పెద్ద బేనర్ అయినా.. ఎంత టాప్ డైరెక్టర్ అయినా.. టాప్ హీరో అయినా సింపుల్ గా నో అనేస్తుంది. గతంలో ఆమె అలా చాలా సినిమాలు రిజెక్ట్ చేసినట్టు వార్తలు వచ్చాయి. తాజాగా సాయిపల్లవికి ఒక భారీ ఆఫర్ వచ్చిందట. కానీ.. నేను చేయను అని కచ్చితంగా చెప్పేసిందట ఆమె. ఫ్యాన్సీ రెమ్యునరేషన్ ఆ సినిమా కోసం ప్రొద్యూసర్స్ ఆఫర్ చేశారని చెబుతున్నారు. కానీ.. సాయిపల్లవి ససేమిరా అంటూ కచ్చితంగా చెప్పేసిందట. ఎంతకావాలన్నా ఇస్తాం అని దర్శక నిర్మాతలు బతిమాలినా సరే.. నేను చేయలేను అంటూ పక్కకి తప్పుకుందట. దటీజ్ సాయిపల్లవి(Sai Pallavi). 

Sai Pallavi

ప్రస్తుతం సాయిపల్లవి(Sai Pallavi) నాగచైతన్య హీరోగా వస్తున్న తండేల్ సినిమాలో చేస్తోంది. దీని తరువాత సౌత్ నుంచి వచ్చిన ఆఫర్లను వేటినీ ఆమె ఒప్పుకోలేదు. తాజాగా వచ్చిన ఈ భారీ ఆఫర్ కూడా రిజెక్ట్ చేసింది. ఇప్పుడు బాలీవుడ్ నుంచి కూడా సాయిపల్లవికి భారీ ఆఫర్లు వస్తున్నాయి. అక్కడ ఆమె సినిమా ఒక్కటి కూడా విడుదల కాకుండానే ఆమెకు ఆఫర్లు వస్తున్నాయట. బాలీవుడ్ లో అల్లుఅరవింద్ భారీగా తెరకెక్కిస్తున్న రామాయణం సినిమాలో సీతగా ప్రస్తుతం సాయిపల్లవి చేస్తోంది. దీంతో పాటు అమీర్ ఖాన్ వారసుడు ఎంట్రీ ఇస్తున్న మూవీలో కూడా సాయి పల్లవి(Sai Pallavi) హీరోయిన్ గా చేస్తోంది. రెండు భారీ ప్రాజెక్టుల్లో మెరవబోతున్న సాయిపల్లవి త్వరలో బాలీవుడ్ లో బిజీ అయిపోయే అవకాశాలున్నాయి. 

Advertisment
తాజా కథనాలు