Euro Cup 2024: యూరో కప్ 2024లో ఫైనల్స్ కు చేరిన స్పెయిన్.. యమల్ రికార్డ్!

యూరో కప్ ఫుట్ బాల్ 2024 టోర్నమెంట్ మొదటి సెమీ ఫైనల్ లో స్పెయిన్ జట్టు 2-1 గోల్స్ తేడాతో ఫ్రాన్స్ ను ఓడించి ఫైనల్స్ చేరింది. స్పెయిన్ జట్టులో 16 ఏళ్ల లామిన్ యమల్ స్పెయిన్ తరపున గోల్ చేసి అంతర్జాతీయ టోర్నమెంట్‌లో తక్కువ వయసులో గోల్ చేసిన వాడిగా రికార్డ్ సృష్టించాడు.  

New Update
Euro Cup 2024: యూరో కప్ 2024లో ఫైనల్స్ కు చేరిన స్పెయిన్.. యమల్ రికార్డ్!

Euro Cup 2024: యూరోకప్ ఫుట్ బాల్ టోర్నీలో స్పెయిన్ ఫైనల్స్ కు చేరింది. ఫ్రాన్స్ తో జరిగిన సెమీ ఫైనల్స్ లో స్పెయిన్ జట్టు 2-1 గోల్స్ తేడాతో విజయాన్ని సాధించింది. స్పెయిన్ టీమ్ లో 16 ఏళ్ల లామిన్ యమల్ ఈ మ్యాచ్ లో ప్రపంచ రికార్డ్ సృష్టించాడు. అంతర్జాతీయ టోర్నమెంట్‌లో లామిన్ యమల్ అత్యంత పిన్న వయస్కుడైన గోల్ స్కోరర్‌గా అవతరించాడు. 

Euro Cup 2024: యూరోకప్ 2024 మొదటి సెమీఫైనల్ ఫ్రాన్స్-స్పెయిన్ మధ్య హోరాహోరీగా సాగింది. ఆట ప్రారంభమైన వెంటనే ఫ్రాన్స్ జట్టు మొదటి గోల్ సాధించింది. కెప్టెన్ కైలియన్ అందించిన క్రాస్ ను  వెనుక పోస్ట్ లో ఉన్న రాండల్ కోలో మువానీ హెడ్‌గోల్ కొట్టాడు. ఆ తరువాత వెంటనే తేరుకున్న స్పెయిన్ సమాధానమిచ్చింది. అంతర్జాతీయ టోర్నీలో ఆడుతున్న అతి పిన్న వయస్కుడైన లామిన్ యమల్ తన మొదటి గోల్ సాధించాడు స్పెయిన్ కోసం. పోస్ట్ ఎడమవైపు నుంచి స్వెర్వింగ్ షాట్ ను కర్లింగ్ చేసే ముందు యంజాల్ కట్ చేసి గోల్ పోస్ట్ లోకి బంతిని పంపించాడు. దీంతో అంతర్జాతీయ స్థాయిలో అతి తక్కువ వయసులో గోల్ సాధించిన మొదటి ఆటగాడిగా యమల్ రికార్డ్ సృష్టించాడు.

Euro Cup 2024: ఆ తరువాత డాని ఓల్మో స్పెయిన్ కోసం రెండో గోల్ చేశాడు. దీంతో స్పెయిన్ 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇక ఆట చివరి వరకూ ఎంత ప్రయత్నించినా ఫ్రాన్స్ జట్టు స్పెయిన్ జట్టు పై మరో గోల్ చేయలేకపోయింది. దీంతో మొదటి సెమీఫైనల్ లో అద్భుత విజయం సాధించి స్పెయిన్ యూరో కప్ ఫైనల్స్ లోకి దూసుకుపోయింది. 

Advertisment
తాజా కథనాలు