UEFA Tourney : UEFA యూరో 2024 (Euro 2024) ఫుట్ బాల్ టోర్నీలో సంచలనం క్రియేట్ అయింది. క్వార్టర్‌ఫైనల్ పోరులో నెదర్లాండ్స్ 2-1తో టర్కీని ఓడించింది. దీంతో సెమీఫైనల్స్ లో ఇంగ్లాండుతో తలపడనుంది నెదర్లాండ్స్.
అయితే మొదటినుంచి హోరా హోరిగా సాగిన పోరులో.. నెదర్లాండ్స్ (Netherlands) ముందుగా వెనుకబడింది. అయినప్పటికీ ప్యత్యర్థికి లొంగకుండా ధీటైన ఆటతో ఘన విజయాన్ని నమోదు చేసింది. అంతకు ముందు జరిగిన మొదటి క్వార్టర్ ఫైనల్ లో లీగ్ దశలో ఇటలీనే ఇంటిముఖం పట్టించిన స్విట్జర్లాండ్ ఇంగ్లాండ్‌కు దీటుగా బదులిచ్చింది. మ్యాచ్‌లో మొదట ఆధిక్యంలోకి వెళ్లినప్పటికీ.. తర్వాత ఇంగ్లాడు పుంజుకుని స్కోరు సమం చేసింది. కానీ చివరికి పెనాల్టీ షూటౌట్లో 5-3తో పైచేయి సాధించిన ఇంగ్లాడ్ సెమీస్‌కు దూసుకెళ్లింది.
ఇక ఇంగ్లాండు (England) విజయంపై స్పందించిన ఇంగ్లాండు మేనేజర్.. 'ఆటగాళ్ళు తెలివైనవారని నేను అనుకున్నాను. ఇది మేము ఆడిన అత్యుత్తమ గేమ్. మేము ప్రత్యర్థులను చాలా తిప్పలు పెట్టాం. వారు నిజంగా అద్భుతంగా పోరాడారు. వారిది బలమైన జట్టు. వారిని ఓడించడం అంత తేలికైన విషయం కాదు. కానీ మేము టోర్నమెంట్‌లను గెలవడమే లక్ష్యంగా ముందుకెళ్లాం. ఫైనల్ పోరులో మా సత్తా చూపించాలి' అని గారెత్ సౌత్‌గేట్ సంతోషం వ్యక్తం చేశారు.
Also Read : వారి ప్రాణాలకు నీవు బాధ్యత వహిస్తావా? సమంతపై గుత్తజ్వాల ఫైర్!