Euro 2024 : ఫుట్‌ బాల్ చరిత్రలో తిరుగులేని నెదర్లాండ్స్‌ ను ఓడించిన ఆస్ట్రియా

ముప్పై-ఆరు సంవత్సరాల క్రితం, జూన్ 25న, రుడ్ గుల్లిట్ , మార్కో వాన్ బాస్టెన్‌లతో కూడిన నెదర్లాండ్స్ జట్టు, డచ్ చరిత్రలో అత్యంత ప్రసిద్ధి చెందిన రోజులలో యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌ల ఫైనల్‌లో 2-0తో సోవియట్ యూనియన్‌ను ఓడించింది

Euro 2024 : ఫుట్‌ బాల్ చరిత్రలో తిరుగులేని నెదర్లాండ్స్‌ ను ఓడించిన ఆస్ట్రియా
New Update

Austria v/s Netherlands : సరిగ్గా ముప్పై ఆరేళ్ళ క్రితం జూన్ 25న నెదర్లాండ్స్  ఫుట్ బాల్ జట్టు ఒక సంచలనం సృష్టించింది. యూరో ఛాంపియన్ షిప్(European Championship) ఫైనల్స్ లో బలమైన సోవియట్ రష్యాపై 2-0 స్కోరుతో గెలిచింది. సరిగ్గా ఇప్పుడు అంటే 2024లో అటువంటి అద్భుతమే మరోటి జరిగింది. కానీ, ఈసారి ఒదిన జట్టు డచ్ జట్టు కావడం విశేషం. ఫుట్ బాల్  టీమ్స్ లో శక్తివంతమైన జట్టుగా పేరుపొందిన నెదర్లాండ్స్ ను చిన్న టీమ్ గా చెప్పుకునే ఆస్ట్రియా షాక్ కి గురిచేసింది. గతంలో ఈ రెండు టీమ్స్ మధ్య జరిగిన ఏడు మ్యాచ్ లలో నెదర్లాండ్స్ జట్టు గెలిచింది. ఒక్క 1990లో మాత్రమే ఆస్ట్రియా గెలిచింది. నెదర్లాండ్స్ మేనేజర్ రోనాల్డ్ కొమన్(Ronald Coman) తన టీమ్ ను ఎంత ప్రోత్సహించినా.. సెల్ఫ్ గోల్స్ రూపంలో వారిని పరాజయం వెంటాడింది.

ఈ గేమ్ లో ఆస్ట్రియా కౌంటర్ విధానం చాలా బాగుంది. గేమ్ ప్రారంభమైన 23వ నిమిషంలో మాలెన్  ఒక గోల్ చేశాడు. తిజ్జని రీజండర్స్ ఇచ్చిన రివర్స్ పాస్ ని మాలెన్  సద్వినియోగం చేశాడు. ఈ సమయంలో నెదర్లాండ్స్ ప్రశాంతంగా ఆడి ఉన్నట్టయితే, గేమ్ డ్రా చేసుకోవడానికైనా అవకాశం ఉండేది. అయితే, అలా జరగలేదు. ఇక్కడ ఆస్ట్రియా గేమ్ ప్లాన్ బావుంది. నిజానికి ఆస్ట్రియా మొదటి 30 నిమిషాల వరకు డచ్ గోల్ పై ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు. ఆ తరువాత ఆస్ట్రియా డచ్ పై గోల్స్ సాధించింది. మొత్తం మీద మూడు గోల్స్ చేసింది.

తరువాత నెదర్లాండ్స్ కి అవకాశాలు వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయింది. సెకండ్ హాఫ్ లో ఆస్ట్రియాకు వారి ఆధిక్యాన్ని నిలుపుకోవడం కొంచెం కష్టంగా మారింది. ఈ సమయంలో నెదర్లాండ్స్ ఈక్వలైజ్ చేసే అవకాశం దొరికింది. దీంతో ఆస్ట్రియా చిక్కుల్లో పడినట్టు అనిపించినా.. నెదర్లాండ్స్ ఆటను తన చేతిలోకి తీసుకునేలా కనిపించినా.. ఒక్కసారిగా ఆస్ట్రియా(Austria) ఎదురుదాడికి దిగడంతో డచ్ జట్టుకు అవకాశం దొరకలేదు. దీంతో 3-1 స్కోరుతో ఆస్ట్రియా జట్టుపై నెదర్లాండ్స్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.

Also read: కేజ్రీవాల్‌ అరెస్ట్‌!

#austria #sports #nedrland
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe