/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Etela-Rajender-Accident-jpg.webp)
Etela Rajender Convoy Accident: బీజేపీ చేరికల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. కాన్వాయ్‌లోని ఓ కారు.. ఆయన ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన ఉన్న ఆహనం వెనుక భాగం డ్యామేజ్ అయ్యింది. ఈటల సేఫ్‌గా ఉండటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఈటల ప్రయాణిస్తున్న వాహనం స్వల్పంగా దెబ్బతినడంతో ఆయన మరో వాహనంలో అక్కడి నుంచి వెళ్లారు. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా మానకొండూరు మండలం లలితాపూర్ వద్ద గొర్రెల మంద అడ్డు వచ్చింది. దాంతో ఈటల వాహనం నడుపుతున్న డ్రైవర్.. సడెన్ బ్రేక్ వేశాడు. ఈ క్రమంలో ఈటల వాహనాన్ని వెనకున్న ఎస్కార్ట్ వాహనం ఢీకొట్టింది. దాంతో ఆయన ప్రయాణిస్తున్న కారు, ఎస్కార్ట్ వాహనం రెండూ స్వల్పంగా ధ్వంసం అయ్యాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానిక బీజేపీ శ్రేణులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ఆయనకు ఏమీ కాకపోవడంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు.