కేసీఆర్‌పై విరుచుకుపడిన ఈటల రాజేందర్

సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారీ వర్షాలకు రాష్ట్రంలోని పంట పొలాలు దెబ్బతిన్నా సీఎం మాత్రం ఇంతవరకు రైతుల పరిహారం గురించి మాట్లాడకపోవటం బాధాకరం అన్నారు. తెలంగాణ నిరుద్యోగులకు ఎలాంటి నోటిఫికేషన్‌ ఇవ్వలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా బీఆర్ఎస్‌ ప్రభుత్వం స్పందించి రైతులకు పరిహారం ఇవ్వాలని ఈటల డిమాండ్‌ చేశారు.

New Update
కేసీఆర్‌పై విరుచుకుపడిన ఈటల రాజేందర్

Etala Rajender lashed out at KCR

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మీడియా సమావేశం నిర్వహించారు. KGBVతో పాటు ఇతర గురుకులాల్లో గెస్ట్ లెక్చరర్‌లకు జీతాలు సరిగ్గా ఇవ్వడం లేదని ఈటల అన్నారు. గెస్ట్ లెక్చరర్ల సమస్యలను అధికార ప్రభుత్వం పరిష్కరించాలని ఆయన డిమాండ్‌ చేశారు. రెన్యువల్ చేస్తామని అసెంబ్లీలో కేసీఆర్ హామీ ఇచ్చినా.. అవి ఇంతవరకు అమలుకు నోచుకోవడం లేదని ఈటల విమర్శించారు. కోర్టు తీర్పును అమలు చేయకుండా ముఖ్యమంత్రి అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. అంతేకాకుండా అరెస్ట్ చేసిన గెస్ట్ లెక్చరర్స్‌ను వెంటనే విడుదల చేయాలని బీజేపీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. కేసీఆర్ ఏలుబడిలో ప్రశ్నిస్తే సహించడం.. సమ్మెలకు, సంఘాలకు ఆస్కారం లేదన్నట్టుగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని అన్నారు.

అంతేకాకుండా తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు రెండు పీఆర్సీలు పెండింగ్‌లో ఉన్నాయని.. VRAలు సమ్మె చేస్తే బెదిరింపులకు దిగారని అన్నారు. VROలను ముంచి.. ఎక్కడెక్కడో వేశారని.. పంచాయతీ సెక్రటరీలను బెదిరించి పని చేయించుకుంటున్నారని బీఆర్ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఏపీలో మహిళ సంఘాలకు 10 వేల రూపాయల గౌరవ వేతనం ఇస్తున్నారని.. కానీ తెలంగాణలో మాత్రం 3 వేల 900 ఇస్తున్నారని చెప్పారు. భూగర్బ జలాలు పెరగడానికి కాళేశ్వరం కారణం కాదని.. భారీగా పడుతున్న వర్షాలే కారణమన్నారు ఈటల. తెలంగాణ ప్రజలు తెలివి తక్కువ వాళ్లలా కనిపిస్తున్నారా ? అని ప్రశ్నించారు. ఇది మంచిది కాదంటూ సీఎం కేసీఆర్‌కు చురకలంటించారు. అప్ కీ బార్ కిసాన్ సర్కార్ అన్న కేసీఆర్ నినాదం బాగుంది కానీ.. మొన్న కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలకు ఇప్పటి వరకు పరిహారం ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఈటల ఎద్దెవా చేశారు. రైతు బంధు ఇచ్చి అన్ని సబ్సిడీలు బంద్ చేసిన ఘనత బీఆర్ఎస్‌ ప్రభుత్వానికే దక్కుతుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Advertisment
తాజా కథనాలు